AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీచ్‌లో సరదాగా ఫోటోలు తీసుకున్నారు.. అంతలోనే …!

విశాఖపట్నం లోని రుషికొండ బీచ్ లో స్నేహితుల సరదా విహారం విషాదంతమైంది. యువకుల్లో ఒకరు సముద్ర కెరటాలలో గల్లంతయ్యారు. యువకుడి కోసం నేవీ హెలికాప్టర్లు, మెరైన్ బోట్లతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన యువకుడు జాహిద్ రజా కోటవీధి ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు.

బీచ్‌లో సరదాగా ఫోటోలు తీసుకున్నారు.. అంతలోనే ...!
Young Man Missing
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Nov 22, 2026 | 1:20 PM

Share

అందమైన సాగర తీరం.. అహ్లాదకరమైన వాతావరణం.. ఎటు చూసినా సందర్శకుల సందడి.. ఇదే ఋషికొండ బీచ్. ఆర్కే బీచ్ తర్వాత విశాఖలో అత్యంత ప్రాచుర్యం పొందిందిన బీచ్ ఇది. బ్లూ ఫ్లాగ్ హోదా కూడా ఈ బీచ్ కు వచ్చింది. అందుకే ఈ బీచ్కు సందర్శకుల రద్దీ క్రమంగా పెరుగుతోంది.

అయితే.. బీచ్ ఆహ్లాదం మాటను ప్రమాదాలు కూడా పొంచి ఉన్న సంగతి సందర్శకులు మరిచిపోతున్నారు. అందమైన బీచ్ ను చూస్తూ ఫిదా అవుతూ.. అక్కడి రాళ్లపై నిల్చుని ఫోటోలు దిగుతూ.. కెరటాల్లో జలకాలు ఆడుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆ కెరటాలే మృత్యు ఒడికి చేర్చే ఘటనలో ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.

తాజాగా.. రుషికొండ బీచ్ లో స్నేహితుల సరదా విహారం విషాదంతమైంది. యువకుల్లో ఒకరు సముద్ర కెరటాలలో గల్లంతయ్యారు. యువకుడి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. విశాఖకూ చెందిన స్నేహితులు భార్గవ నారాయణ, ఆనంద్ పాల్, వంశీ, వెంకట సాయి, వికాస్, రోషన్, చరణ్, జాహీద్ రజా స్నేహితులు. ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. ఎనిమిది మంది స్నేహితుల కలిసి శనివారం సాయంత్రం సరదాగా విహారానికి వెళ్లారు. బీచ్ లో ఫోటోలు తీసుకున్నారు.

అయితే సముద్రంలో స్నానం చేస్తుండగా.. సయ్యద్ జాహిద్ రజా ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. కెరటాల్లో గల్లంతయ్యాడు. చుట్టుపక్క గాలించినా కనిపించలేదు. దీంతో మిగిలిన స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వెంటనే పోలీసులు, స్థానిక గజ ఈత గాళ్ళకు సమాచారం అందించారు. పేరెంట్స్ కూడా సమాచారం వెళ్ళింది. శనివారం పొద్దుపోయే వరకు గాలించిన ఫలితం లేకపోయింది.

ఇక ఆదివారం ఉదయం నుంచి రెస్క్యూ అండ్ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. నేవీ హెలికాప్టర్లు, మెరైన్ బోట్లతో గాలిస్తూ ఉన్నారు. తీవ్ర విషాదంలో మునిగిపోయారు బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులు. గల్లంతైన యువకుడు జాహిద్ రజా కోటవీధి ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు.

Follow Us