AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ మూవీ పైనే భారం.. ఈ బ్యూటీకి స్టార్ డైరెక్టర్ సెంటిమెంట్‌ అయినా కలిసొచ్చేనా ??

యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. మెగాహీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ "ఉప్పెన"తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రం "జనవరి 12 విడుదల". ఈ సినిమాతో అయినా ఈ బ్యూటీ మళ్లీ హిట్ కొట్టి తెలుగులో బిజీ అవుతుందా ? లేదా ?? అని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఆ మూవీ పైనే భారం.. ఈ బ్యూటీకి స్టార్ డైరెక్టర్ సెంటిమెంట్‌ అయినా కలిసొచ్చేనా ??
Actress Krithi Shetty
Korivi Jayakumar
|

Updated on: Nov 22, 2026 | 12:54 PM

Share

యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. మెగాహీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ “ఉప్పెన”తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. బేబమ్మ పాత్రలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ భారీ సక్సెస్ తో ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టగా.. నితిన్, నాగ చైతన్య, రామ్, నాని, శర్వానంద్ వంటి యంగ్ హీరోలతో నటించింది. అందులో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మాత్రమే హిట్లుగా నిలవగా.. మిగతా చిత్రాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి.

ఈ క్రమంలోనే ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గగా.. అదే సమయంలో శ్రీలీల ఎంట్రీ ఇవ్వడంతో రేసులో కాస్త వెనుక పడింది. దీంతో తెలుగు సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చి.. కోలీవుడ్, మాలీవుడ్ లలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మలయాళంలో ఏఆర్ఎం సినిమాతో విజయం సక్సెస్ కొట్టినా.. వరుసగా అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇక తమిళంలోనూ స్ట్రెయిట్ సినిమాలు, బైలింగ్వల్ చిత్రాలు చేస్తూ రాణిస్తుంది. అయితే ఆమెకు భారీ హిట్స్ దక్కకపోవడంతో మళ్లీ టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది.

ఆ మూవీ పైనే భారం..

కృతిశెట్టి ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న చిత్రం “జనవరి 12 విడుదల”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్‌కి జోడీగా కీర్తి సురేష్.. కళ్యాణ్ రామ్‌కు జంటగా కృతి కనిపించనున్నారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్, జెడ్ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ నెలకొంది.

స్టార్ డైరెక్టర్ సెంటిమెంట్‌ కలిసొచ్చేనా..?

‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనిల్ రావిపూడి.. ఆ తర్వాత ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘ఎఫ్3’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస బ్లాక్‌బస్టర్ లను అందుకున్నారు. 2025 సంక్రాంతి కానుకగా ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.

అయితే తెలుగులో ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కృతికి ఈ సినిమా రిజల్ట్ కీలకమనే చెప్పాలి. కాగా అనిల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంటుంది. ఇప్పటి వరకు వచ్చిన ఆయన చిత్రాల్లో హీరోయిన్స్ హిట్స్ అందుకోవడమే కాకుండా ఆ తర్వాత కూడా వరుస అవకాశాలను దక్కించుకున్నారు. దాంతో బేబమ్మకు కూడా అనిల్ రావిపూడి సెంటిమెంట్ కలిసొచ్చి మళ్లీ హిట్ కొడుతుందా ? తిరిగి బిజీ హీరోయిన్‌గా మారుతుందా? అని జోరుగా చర్చ జరుగుతుంది.

Follow Us