AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మునక్కాయ పెసరపప్పు కూర ఇలా చేస్తే అన్నంలోకి కమ్మగా ఉంటుంది

మునక్కాయ పెసరపప్పు కూర రుచిగా ఉంటుంది. ఇంకా మీరు దీనిని మసాలాలు లేకుండా సులభంగా, కమ్మగా చేసుకునే ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మునక్కాయ, పెసరపప్పు, టమాటాలతో చేసే ఈ వంటకం పొట్టకి హాయిగా ఉండటమే కాకుండా, తక్కువ సమయంలోనే రెడీ చేసుకోవచ్చు.

Prasanna Yadla
|

Updated on: Nov 22, 2026 | 11:43 AM

Share
ముప్పావు కప్పు పెసరపప్పును ఒక గంట పాటు నీటిలో నానబెట్టి, రెండుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. మూడు మునక్కాయలను తీసుకొని, పైన తొక్కను తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొక్క తీయడం వల్ల మునక్కాయలు త్వరగా ఉడుకుతాయి. ఇంకా 5  మీడియం సైజు టమాటాలను, రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ కూరలో టమాటాలు ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది.

1 / 5

ఒక పాన్ లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి, ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగాక, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించాలి.

2 / 5
ఉల్లిపాయ ముక్కలు జస్ట్ ఒక నిమిషం వేగిన తర్వాత మునక్కాయ ముక్కలు వేయాలి. దీనితో పాటు ఐదారు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేయండి. ఒక టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్ లో ఉల్లిపాయలు మెత్తబడేంతవరకు వేయించాలి. ఈ నూనెలో మునక్కాయ ముక్కలు కొద్దిగా వేగితే రుచి బాగుంటుంది. సుమారు రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది.

3 / 5
 ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత, నానబెట్టిన పెసరపప్పును, కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి బాగా కలపాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన చిట్కా: పెసరపప్పును ఉప్పుతో కలిపి ఉడికిస్తే కొన్నిసార్లు ఉడకదు. కాబట్టి పప్పు ఉడికిన తర్వాత చివర్లో ఉప్పు వేయడం మంచిది. అయితే, మీ పప్పు నాణ్యతను బట్టి ముందుగా ఉప్పు వేసినా ఉడికితే వేసుకోవచ్చు. అన్నింటినీ బాగా కలిపి, ఫ్లేమ్ ను లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి మగ్గించాలి. మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి.

4 / 5
 పెసరపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత మీరు తినగలిగేంత కారం వేసుకోండి. మనం ఇప్పటికే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం మోతాదు చూసి వేయాలి. కారం వేసి మరోసారి బాగా కలిపి, లో ఫ్లేమ్ లోనే మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అర కప్పు నీళ్లు పోసి కలపాలి. నీళ్లు ఎక్కువగా పోయవద్దు, టమాటా గుజ్జుతోనే పప్పు ఉడుకుతుంది. ఒక టీస్పూన్ ధనియాల పొడి వేసి కలిపి, మళ్లీ మూత పెట్టి లో ఫ్లేమ్ లో మునక్కాయ, పెసరపప్పు పూర్తిగా ఉడికేంతవరకు మగ్గించాలి. కూర బాగా మగ్గి, మునక్కాయ, పెసరపప్పు మెత్తగా ఉడికిన తర్వాత, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలపాలి. వేడివేడి అన్నంతో ఈ కమ్మని మునక్కాయ పెసరపప్పు కూరను ఆస్వాదించండి. పిల్లల కోసం చేస్తే కారం కొద్దిగా తగ్గించి వేస్తే వారు ఇష్టంగా తింటారు. మసాలాలు లేకుండా సులభంగా చేసుకునే ఈ కూర మీకు తప్పకుండా నచ్చుతుంది.

5 / 5
Follow Us