Drishyam 3 OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘దృశ్యం 3’.. తెలుగులోనూ రూ. 580 కోట్ల బ్లాక్ బస్టర్ థ్రిల్లర్!
అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన దృశ్యం 3.. ది కంక్లూజన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 580 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తద్వారా ఏడాది బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా రికార్డులకెక్కింది.

Drishyam 3 The Conclusion Movie
బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దృశ్యం-3..ది కన్‌క్లూజన్). దృశ్యం ఫ్రాంఛైజీ సిరిస్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూడో పార్ట్ ఈ ఏడాది గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 02న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది. సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన దృశ్యం-3 ఓవరాల్ గా రూ. 580 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా ఈ ఏడాది బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా ఘనత సొంతం చేసుకుంది. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఒరిజినల్ దృశ్యం 3 కంటే ఈ బాలీవుడ్ దృశ్యం 3 బాగా ఉందని విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ట్విస్టులు ఆడియెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయని చెప్పుకోవచ్చు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన దృశ్యం 3.. ది కంక్లూజన్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దృశ్యం 3 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 27( శుక్రవారం) నుంచి దృశ్యం 3 ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
కాగా దృశ్యం 3 ది కంక్లూజన్ థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే రిలీజైంది. ఇప్పుడు ఓటీటీలోనూ కేవలం హిందీ వెర్షన్ కు సంబంధించి మాత్రమే అప్డేట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు తదితర దక్షిణాది భాషల్లోనూ స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక దృశ్యం 3 సినిమాకు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. స్టార్ స్టూడియో 18 సమర్పణలో పనోరమా స్టూడియోస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అజయ్ దేవగణ్ తో పాటు జైదీప్ అహ్లావత్, శ్రియా సరన్, ఇషితా దత్తా, టబు, రజత్ కపూర్, ప్రకాష్ రాజ్, మృణాల్ జాదవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
నవంబర్ 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో దృశ్యం 3
📢 OFFICIAL ANNOUNCEMENT 💥
#Drishyam : The Conclusion (Hindi)
ఇవి కూడా చదవండిStreaming from November 27 on Netflix 🍿!!
#OTT_Trackers https://t.co/SmduRaxpr4
— OTT Trackers (@OTT_Trackers) November 21, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us




