టాలీవుడ్ నాకు ఎన్నో నేర్పింది.. నాలోని నటనను బయటకు తీసింది తెలుగు సినిమాలే: రకుల్ ప్రీత్
ఒకప్పుడు వరస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేసింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించేసింది.అలాగే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అందం, అభినయంతో నెట్టింట సందడి చేస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అయితే ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా, ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయాలని కోరుకునే నటీమణులు మాత్రం కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు పౌరాణిక పాత్రతో మరోసారి వార్తల్లో నిలుస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన రామాయణం సినిమాలో శూర్పణఖ పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్‌ను పరిశీలిస్తే ఎన్నో విభిన్నమైన పాత్రలు కనిపిస్తాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం తనకు అలవాటైన ఇమేజ్‌ను పక్కనపెట్టి, నటిగా కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ‘రామాయణం’ చిత్రంలో రకుల్ శూర్పణఖ పాత్రను పోషించింది. సాధారణ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా ఉండే ఈ క్యారెక్టర్ ఆమె కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. పౌరాణిక నేపథ్యం ఉన్న పాత్రలో ఆమె ఎలా కనిపిస్తారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
తాజాగా తన కెరీర్ గురించి మాట్లాడిన రకుల్ తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. నటిగా తనకు గుర్తింపు రావడానికి టాలీవుడ్ ఎంతో సహాయపడిందని తెలిపింది. తనలోని నటనా సామర్థ్యాన్ని వెలికితీసి, ఎన్నో అవకాశాలు కల్పించిన ఘనత తెలుగు పరిశ్రమకే దక్కుతుందని పేర్కొంది. జాతీయ స్థాయిలో సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని రకుల్ మర్చిపోలేదు. టాలీవుడ్‌లో పనిచేసిన అనుభవం తనకు ఎంతో నేర్పిందని, కెరీర్‌లో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా చేసిందని చెప్పుకొచ్చింది. తన ఎదుగుదలలో తెలుగు సినిమాల పాత్ర ఎప్పటికీ ప్రత్యేకమని వెల్లడించింది. సినిమా రంగంలో విజయాన్ని అందుకోవాలంటే షార్ట్‌కట్స్ వెతకడం కంటే కష్టపడటమే ముఖ్యమని రకుల్ తెలిపింది. కెరీర్ మొదట్లో తాను పెట్టుకున్న లక్ష్యాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని తెలిపారు. నిరంతరం శ్రమిస్తూ, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే
రామాయణం సినిమాలో తన పాత్ర కోసం రకుల్ ప్రత్యేకంగా సిద్ధమయ్యారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ క్యారెక్టర్‌కు తగిన రూపాన్ని తీసుకురావడానికి మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో చిత్ర బృందం ఎంతో జాగ్రత్తలు తీసుకుంది. ప్రతిరోజూ గంటల తరబడి మేకప్ కోసం కేటాయించిందట. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించారు. ఇంతటి భారీ తారాగణం ఉన్న సినిమాలో రకుల్‌కు శూర్పణఖ పాత్ర దక్కడం విశేషం. తన పాత్ర నిడివి కంటే దాని ప్రాధాన్యతపైనే ఆమె దృష్టి పెట్టింది. ఇప్పటివరకు చేసిన పాత్రలతో పోలిస్తే శూర్పణఖ క్యారెక్టర్ రకుల్‌కు పూర్తిగా భిన్నమైనది. అందుకే ఈ సినిమా ఆమె నటనా ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది. కేవలం అందం, గ్లామర్‌తోనే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనూ ప్రేక్షకులను మెప్పిస్తుంది రకుల్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
