AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిడ్నీ, లివర్ వ్యర్థాలను తొలగించే అద్భుత ఔషధ మొక్క.. కనిపిస్తే వదలకండి..! ఎలా వాడాలో తెలుసా?

రోడ్ల పక్కన కలుపు మొక్కలా కనిపించే పునర్నవ ప్రకృతి మనకు అందించిన అద్భుత ఔషధ మొక్క. సిద్ధ, ఆయుర్వేద వైద్యంలో దీనిని కిడ్నీ, కాలేయ వ్యాధుల నివారణకు విరివిగా ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో ఉండే పోషకాలు, ఫైబర్ కిడ్నీల్లోని వ్యర్థాలను, రాళ్లను తొలగించడంతో పాటు కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేసే శక్తి దీనికి ఉంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడం, బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, గాయాలను మాన్పడంలో పునర్నవ ఎంతో మేలు చేస్తుంది.

కిడ్నీ, లివర్ వ్యర్థాలను తొలగించే అద్భుత ఔషధ మొక్క.. కనిపిస్తే వదలకండి..! ఎలా వాడాలో తెలుసా?
Punarnava Medicinal Plant
Jyothi Gadda
|

Updated on: Nov 22, 2026 | 8:06 AM

Share

మన చుట్టుపక్కల రోడ్ల పక్కన, వర్షాకాలంలో ఖాళీ స్థలాల్లో సహజంగా పెరిగే పునర్నవ మొక్క విలువ చాలామందికి తెలియదు. దీనిని సాధారణ కలుపు మొక్కగా భావించి పశువులకు మేతగా వదిలేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో దీనిని కేవలం మేతగా చూసినా, ఆధునిక ఆరోగ్య నిపుణులు కూడా దీనిని ఒక శక్తివంతమైన ఆకుకూరగా గుర్తిస్తున్నారు. సిద్ధ, ఆయుర్వేద వైద్యంలో దీనిని మహా ఔషధంగా పరిగణిస్తారు. గుండ్రటి ముదురు ఆకుపచ్చ ఆకులు, చిన్న గులాబీ రంగు పూలతో ఉండే ఈ తీగ జాతి మొక్కలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

కిడ్నీలు, కాలేయం శుభ్రపడతాయి..

పునర్నవ ఆకులు వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేసే శక్తిని కలిగి ఉంటాయి. కిడ్నీలో రాళ్లు, కిడ్నీ పనితీరు మందగించడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటంలో పునర్నవ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే కాలేయాన్ని డిటాక్స్ చేసి బలోపేతం చేస్తుంది. ఎముకలు, కీళ్ల నొప్పులను తగ్గించడంలోనూ ఈ ఆకులు సహాయపడతాయి.

జీర్ణక్రియ, బరువు తగ్గడం, ఇతర ప్రయోజనాలు

పునర్నవ ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణకోశ సమస్యలు, కడుపు నొప్పి, పేగులపై ఒత్తిడి తగ్గుతాయి. జీవక్రియను పెంచి శరీరంలోని చెడు కొవ్వును కరిగించడం ద్వారా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. దీనిలో ఉండే హీలింగ్ గుణాలు లోపలి, బయటి గాయాలను వేగంగా మాన్పుతాయి. ఆకులను శుభ్రంగా కడిగి కొద్దిగా నువ్వుల నూనెతో మెత్తగా నూరి గాయాలపై రాస్తే పుండ్లు త్వరగా తగ్గుతాయి. అంతేకాకుండా కంటి ఇన్ఫెక్షన్లు, చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచడం, ఒత్తిడిని తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ పునర్నవ ఎంతో ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

పునర్నవను ఎలా తీసుకోవాలి?

నాటు మందుల దుకాణాల్లో లభించే పునర్నవ ఆకుల పొడిని ఒక స్పూన్ తీసుకుని, 200 మి.లీ. నీటిలో మరిగించి ఉదయం ఖాళీ కడుపుతో తాగవచ్చు. రాత్రి భోజనం తర్వాత టీలాగా కూడా తీసుకోవచ్చు. తాజా ఆకులు దొరికితే కందిపప్పుతో కలిపి ఆకుకూరలా వండుకుని తినవచ్చు. లేదా ఆకుల నుంచి రసం తీసి రోజుకు 30 మి.లీ. చొప్పున తాగవచ్చు.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

పునర్నవ రసాన్ని అతిగా తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు దీనిని తీసుకోకూడదు. ఇతర అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే పునర్నవను ఆహారంలో చేర్చుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us