AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత దారుణం..రూ.10 వేల అప్పు తీర్చలేక స్నేహితులతో కలిసి యువకుడి హత్య.. కట్‌చేస్తే..

అప్పు ఇచ్చిన పాపానికి, తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. మద్యం మత్తులో నలుగురు స్నేహితులు కలిసి ఈ కిరాతకానికి పాల్పడ్డారు. అయితే నేరం ఎప్పటికైనా బయటపడుతుందనే భయంతో చివరికి నిందితులే పోలీసుల ఎదుట లొంగిపోయారు. పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఈ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. కేవలం పది వేల రూపాయల ఆర్థిక వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఎంత దారుణం..రూ.10 వేల అప్పు తీర్చలేక స్నేహితులతో కలిసి యువకుడి హత్య.. కట్‌చేస్తే..
Guntur Murder Case
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 22, 2026 | 11:31 AM

Share

అప్పు తీసుకున్నాడు.. తీర్చమని అడిగినందుకు కోసం వచ్చింది. నలుగురు స్నేహితులతో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేశారు. మద్యం మత్తులో అప్పు ఇచ్చిన వాడిని లేపేశారు. ఆ తర్వాత నిజం బయటపడుతుందని పోలీసులకు లొంగిపోయారు. ఈ ఘటన గుంటూరు పట్టాభిపురం పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

వెంగళాయపాలెం టిడ్కో అపార్ట్ మెంట్స్ లో యశ్వంత్ నివసిస్తుంటాడు. యశ్వంత్ తనకు పరిచయం ఉన్న నాగరాజు వద్ద నుండి కుటుంబ అవసరాల నిమిత్తం పదివేల రూపాయలు అప్పుతీసుకున్నాడు. అప్పు సకాలంలో తీర్చలేకపోవడంతో నాగరాజుతో వివాదం ఏర్పడింది. తనకు అప్పు ఇవ్వడమే కాకుండా నాగరాజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడన్న విషయాన్ని యశ్వంత్ తన స్నేహితులైన మనోజ్, సుభాష్, అశోక్ లకు చెప్పాడు. అయితే నాగరాజుకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించున్నారు.

పలకలూరు రోడ్డులోని స్వగ్రుహా హైట్స్ లో నాగరాజు నివసిస్తుంటాడు. ఫోన్ పే సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య పిల్లలు విజయవాడలోని అత్తావారింట్లో ఉండటంతో వారిని తీసుకొస్తాని తన తండ్రికి చెప్పి గత నెల 20న బటయకు వెళ్లాడు. తనతో చెప్పి వెళ్లిన కొడుకు రాత్రైనా ఇంటికి రాలేదు. అటు భార్య పిల్లల వద్దకు వెళ్లలేదు. దీంతో నాగరాజు తండ్రి నతానియేలుకు అనుమానం వచ్చింది. తర్వాత రోజు వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే గత నెల 22న పలకలూరి రోడ్డులోనే నాగరాజు మ్రుతదేహాన్ని గుర్తించారు. మ్రుతుని సెల్ ఫోన్, బైక్ లభ్యం కాలేదు.

ఇవి కూడా చదవండి

మర్డర్ కేసుగా మార్చిన పట్టాభిపురం పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే యశ్వంత్ అతని స్నేహితులు తాము హత్య చేశామని ఒప్పుకొని లొంగిపోయారు. తీసుకన్న అప్పు తీర్చమని నాగరాజు గొడవ చేయడంతో హత్య చేసినట్లు చెప్పారు. ఇరవై తేదిన నలుగురు మద్యం సేవించి నల్లపాడు పిఎస్ వద్ద టిడ్కో ఇళ్ల వద్ద నాగరాజు ఉన్నాడని తెలుసుకొని అక్కడకు వెళ్లారు. అతనితో ఘర్షణ పడి బీరు బాటిల్లతో దాడి చేశారు. దీంతో నాగరాజు అక్కడికక్కడే చనిపోయాడు. అతని వద్ద నున్న సెల్ ఫోన్, బైక్ తీసుకొని పారిపోయారు. నేరం ఒప్పుకోవడంతో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తేల్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us