గుంటూరు జిల్లాలో పదిహేనేళ్ళు గా టివి9 రిపోర్టర్ గా పని చేస్తున్నాను. 2009, 2024ల్లో కృష్ణానది వచ్చిన వరదలను కవర్ చేశాను. 2014, 2019, 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రిపోర్టర్ గా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి, రిషితేశ్వరి హత్యలపై ప్రత్యేక కథనాలు ఇచ్చాను. టివి9లో చేరక ముందు మా టివిలో సబ్ ఎడిటర్ గా పని చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికైన 2009 అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు సమయంలో సబ్ ఎడిటర్ గా ప్రత్యేక వార్తలు ఇచ్చాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పిజి చేసిన నేను మొదట ప్రజాశక్తి పేపర్ లో మండల రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాను. పుస్తకాలు చదవడం నా హాబీ… చరిత్ర పుస్తకాలను ఎక్కువ మక్కువతో చదువుతాను. శ్రీ శ్రీ గారంటే ప్రత్యేక అభిమానం… టివి9లో పని చేస్తూ ట్రాన్స్ ఫర్ కొద్ది నెలల పాటు శ్రీకాకుళంలో రిపోర్టర్ ఉన్నాను. ఆసమయంలో ధర్మల్ పవర్ ఫ్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సోంపేట ఉద్యమాన్ని కవర్ చేశాను
పెట్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై మీ పెట్స్‌ను పక్కింటి వారికి ఇవ్వాల్సి అవసం లేదు.. ఇక్కడ ఇస్తే చాలు..
పెంపుడు జంతువులను పెంచుకునే వారికి ఇదొక గుడ్‌న్యూస్.. ఇకపై మీరు ఎదైనా టూర్స్ కానీ, ఊర్లకు కాని వెళితే, మీ పెట్స్‌ను తీసుకెళ్లడమో, పక్కింటి వాళ్లకు ఇచ్చి వెళ్లాల్సిన అవసరం లేదు. వీళ్లకు అప్పజెపితే చాలు మీరు మళ్లీ తిరిగి వచ్చేంత వరకు వాళ్లే దాన్ని వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు వచ్చిన తర్వాత వాటిని మళ్లీ మీకు తిరిగి ఇస్తారు. ఇంతకి ఏంటీ సర్వీస్ అనుకుంటున్నారా.. అయితే తెలుసుకుందాం పదండి..
- T Nagaraju
- Updated on: Jul 17, 2025
- 10:38 am
Andhra News: చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడు.. కానీ మాములోడు కాదు.. అతని చేసిన పనులు తెలిస్తే..
ఆస్తి ముందు రక్త సంబంధాలు కూడా దిగదిడుపే అయ్యాయి. తోడబుట్టిన చెల్లినే కాదు కన్నవారిని కడుపున పుట్టిన వారికి కిరాతకంగా కడతేర్చాడు కసాయి వాడు. ఆస్తి అడిగినా.. డబ్బులు ఇవ్వమన్నా ఎక్కడ లేని కోపంతో సొంతవారినే ముట్టబెట్టాడు. వరసగా జరుగుతున్న హత్యల్లో అతని ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక సారి జైలుకెళ్లి వచ్చిన అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. కన్న కొడుకునే చంపి పాతిపెట్టిన ఘటనలో మరోసారి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
- T Nagaraju
- Updated on: Jul 16, 2025
- 12:04 pm
ఇంత అమానుషమా.. పెద్దల మాట వినలేదని కుల బహిష్కరణ.. ఎక్కడో కాదు..
కుల కట్టుబాట్లు తెంచుకుని దేశం అభివృద్ది దిశగా దూసుకుపోతున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ కట్టుబాట్లకు కట్టుబడని వారిపై బహిష్కరణ వేటు వేస్తూనే ఉన్నారు. గుంటూరు సమీపంలో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. గుంటూరుకు కూత వేటు దూరంలో ఉన్న వెనిగండ్లలో కుల పెద్దలు ఆదెమ్మ కుటుంబాన్ని కులం నుండి వెలివేశారు. వెలివేయడమే కాకుండా లక్ష రూపాయల జరిమానా కూడా వేశారు. ఇంతకు వాళ్లను ఎందుకు వెలివేశారో తెలుసుకుందాం పదండి.
- T Nagaraju
- Updated on: Jul 15, 2025
- 10:59 pm
Andhra Paris: ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.. ఎప్పుడంటే?
ఆంధ్రా ప్యారిస్ అంటే అందరికి ఠక్కున గుర్తొచ్చేది తెనాలే...ప్యారిస్ లో లాగా ఇక్కడ కూడా మూడు పంట కాలువలు తెనాలి పట్టణం గుండా వెలుతుంటాయి. ఈ పంట కాలవల్లో పర్యాటక రంగ అభివ్రుద్దిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక ద్రుష్టి సారించారు. ఇందులో భాగంగా ఇలా మూడు కాలువల్లో బోటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
- T Nagaraju
- Updated on: Jul 14, 2025
- 11:29 pm
జులై 12.. అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య.. అప్పులు రాసిన మరణ శాసనం.. అయ్యో పిల్లలు..
పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లికి చెందిన బ్రహ్మా రెడ్డి, సుబ్బమ్మలది చిన్న కుటుంబం. ఇరవై ఏళ్ళ క్రితం వివాహమైంది. వీరికి పన్నెండేళ్ళ అఖిల్ రెడ్డి, పదకొండేళ్ల లక్ష్మీ కార్తిక ఇద్దరూ పిల్లలు.. సంసారం సాఫిగానే సాగిపోతుంది. వ్యవసాయంపై అధారిపడి జీవించే వీరి కుటుంబంలో రెండేళ్ళ నుంచి విషాదం మొదలైంది.
- T Nagaraju
- Updated on: Jul 13, 2025
- 9:18 am
Guntur: ఇనుము, ప్లాస్టిక్ లేదా స్టీల్.. బేరం ఆడితే ఉల్లిపాయలే కాదు డబ్బులు కూడా..
చెత్త, వ్యర్ధ పదార్ధాలను తొలగించేందుకు ఏపీ పంచాయితీ రాజ్ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రధచక్రాలు కదిలి రానున్నాయి. ఆ వివరాలు ఏంటో.. ఏ ప్రాంతంలోనూ..? ఈ ఆర్టికల్‌లో చూసేద్దాం పదండి. ఓ సారి ఇక్కడ లుక్కేయండి మరి. మీకోసమే.
- T Nagaraju
- Updated on: Jul 11, 2025
- 1:27 pm
Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు
గుంటూరు నగరంలో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. స్థంభాల గరువుకు చెందిన కరిముల్లా తురకపాలెం వెళ్లే రోడ్డు పొదల్లో శవమై కనిపించాడు. అయితే అతన్ని ఎవరూ హత్య చేసి ఉంటారన్న అంశంపై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
- T Nagaraju
- Updated on: Jul 10, 2025
- 7:21 pm
Andhra: ఉదయాన్నే పొలానికి వెళ్లిన భార్యాభర్తలు.. ఇంటికి రాలేదని వెళ్లి చూడగా..
భార్యాభర్తలు.. ఇద్దరూ కలిసి పొలం వెళ్ళారు.. ఎంతకూ తిరిగి రాలేదు.. దీంతో ఏం జరిగిందోనని స్థానికులు పొలానికి వెళ్ళి చూశారు.. భార్య శవం కనిపించింది. భార్యని చంపి భర్త పారిపోయాడని అంతా భావించారు. కానీ.. మరుసటి రోజు షాకింగ్ సీన్ కనిపించింది.. భర్త కూడా శవమై కనిపించాడు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.
- T Nagaraju
- Updated on: Jul 9, 2025
- 5:12 pm
Guntur: రూ. 7 లక్షల అప్పు.. నాలుగు రూపాయల వడ్డీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే
మూడేళ్ల క్రితం ఏడు లక్షల అప్పు తీసుకున్నారు. క్రమ క్రమంగా వడ్డీ కూడా సకాలంలో చెల్లిస్తున్నారు. అయితే ఆ తర్వాత అప్పు తీసుకున్నవారికీ ఆరోగ్యం బాగోకపోవడం.. వడ్డీ కట్టడంలో ఇబ్బంది పడటంతో.. నెక్స్ట్ సీన్ ఏమైందంటే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- T Nagaraju
- Updated on: Jul 8, 2025
- 2:35 pm
Andhra News: ఆపరేషన్ సింధూర్‌తో పెళ్లి వాయిదా.. ఆ ముచ్చట తీరకుండానే ఇలా..! ఆర్మీ జవాన్ కథ తెలిస్తే..
ఆపరేషన్ సిందూర్ కోసం పెళ్లి వాయిదా వేసుకున్న ఓ యువ జవాన్ ఆ ముచ్చట తీరకుండానే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు తుపాకి పేలి బాపట్ల జిల్లా చిలకాలవారిపాలెంకు చెందిన రవి కుమార్ అనే జవాన్ రాజౌరీలో చనిపోయాడు. చేతిలో ఉన్న తుపాకీ మిస్ ఫైర్ అవ్వడంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.
- T Nagaraju
- Updated on: Jul 7, 2025
- 6:01 pm
Pedakakani: ఆహా.. పాత బంగారం ఎక్కువ రేటుకు కొంటున్నారు – కరెన్సీ కూడా సీల్ కట్టలు ఇస్తున్నారు – తర్వాత
పాత బంగారం కొనుగోలు పేరుతో ప్రజలను మోసం చేస్తూ తిరుగుతున్న నార్త్ ఇండియా ముఠా సభ్యులు గుంటూరు జిల్లా పెదకాకానిలో పోలీసులకు చిక్కారు. శ్రీకాళహస్తిలో కేసులు ఉన్న వారిని టెక్నికల్ ఆధారాలతో గుర్తించిన పోలీసులు, దర్గా వద్ద నుంచే అదుపులోకి తీసుకున్నారు.
- T Nagaraju
- Updated on: Jul 3, 2025
- 8:03 pm
Andhra: రాత్రి 9 గంటల సమయం – హైవేపై 10 ఏళ్ల అమ్మాయితో ఓ వ్యక్తి – ఆ తర్వాత కాసేపటికే
అది గుంటూరు - విజయవాడ మధ్యలో ఉన్న బకింగ్ హామ్ కాలువ. రాత్రి 9 గంటల సమయంలో వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. అప్పుడే ఓ వ్యక్తి దాదాపు 10 ఏళ్ల వయసున్న అమ్మాయితో అటుగా వెళ్తున్నారు. అయితే అప్పుడే ఓ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
- T Nagaraju
- Updated on: Jul 2, 2025
- 3:17 pm