AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: రాత్రివేళ స్కూటీపై ఒంటరిగా బయలు దేరిన మహిళ.. అకస్మాత్తుగా ఫోన్ బంద్.. ఆ తర్వాత..

పల్నాడు జిల్లా ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన ఒక మహిళ నర్సరావుపేటలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుంది. ప్రతి రోజూ షాపు నుండి స్కూటీ మీద ఇంటికి వెళుతుంటుంది. ఎప్పటిలాగే సోమవారం రాత్రి షాపు నుండి ఇంటికి స్కూటీపై బయలు దేరింది. అయితే రొంపిచర్ల మండలం తుంగపాడు వద్దకు వచ్చే సరికి ఆమె కనిపించడకుండా పోయింది.

Andhra: రాత్రివేళ స్కూటీపై ఒంటరిగా బయలు దేరిన మహిళ.. అకస్మాత్తుగా ఫోన్ బంద్.. ఆ తర్వాత..
Palnadu Crime News
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 18, 2026 | 11:23 AM

Share

పల్నాడు జిల్లా ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన ఒక మహిళ నర్సరావుపేటలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుంది. ప్రతి రోజూ షాపు నుండి స్కూటీ మీద ఇంటికి వెళుతుంటుంది. ఎప్పటిలాగే సోమవారం రాత్రి షాపు నుండి ఇంటికి స్కూటీపై బయలు దేరింది. అయితే రొంపిచర్ల మండలం తుంగపాడు వద్దకు వచ్చే సరికి ఆమె కనిపించడకుండా పోయింది. ఆమె మాయమయ్యే సమయానికి బంధువులతో ఫోన్ లో మాట్లాడుతుంది. ఒక్కసారిగా ఫోన్ మాట్లాడక పోయేసరికి అనుమానం వచ్చిన బంధువులు వస్త్ర దుకాణం వాళ్లకి ఫోన్ చేసి ఆ మహిళ గురించి చెప్పారు. దీంతో షాపు నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మహిళా కిడ్నాప్ అంటూ ప్రచారం జరగడంతో పోలీసులు ఆ మహిళ వెళ్లిన దారిలోనే వెతుక్కూంటూ వెళ్లారు. తుంగపాడు వద్ద మహిళ బైక్ కనిపించడంతో పాటు మరొక రెండు బైక్లు ఘటనా స్థలంలో ఉన్నట్లు గుర్తించారు. మహిళ చెప్పులు కూడా ఆ సమీపంలోనే ఉన్నాయి. అప్పటికే ఆమె సెల్ ఫోన్ స్విఛ్చాఫ్ అయింది. దీంతో పోలీసులు రాత్రి పదకొండు గంటల సమయం వరకూ ఆ చుట్టుపక్కల అంతా టార్చిలైట్లు వేసుకొని వెదికారు. అయితే ఆమహిళతో పాటు అక్కడ ఎవరూ కనిపించలేదు. దీంతో పోలీసులు అద్దంకి – నార్కెట్ పల్లి హైవేపైకి వచ్చారు. అక్కడ గాలింపు మొదలుపెట్టారు.

అయితే, తెల్లవారు జామున మూడు గంటల సమయంలో మహిళ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఆమె కూడా ఏకంగా రొంపిచర్ల పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంది. దారిలో ఆకతాయి తనను అడ్డగించడమే కాకుండా తన చేతికున్న ఉంగరాలు తీసుకొని పారిపోయినట్లు చెప్పింది. ఆ ఆగంతుకుడి నుండి తప్పించుకునేందుకు పొలాల్లోకి పారిపోయి అప్పటి నుండి అష్టకష్టాలు పడుతూ హైవే పైకి చేరినట్లు చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలోనూ తుంగపాడు సమీపంలో ఇటువంటి ఘటనే రెండేళ్ల క్రితం చోటు చేసుకుంది. దీంతో గంజాయ బ్యాచ్ లు దాడులు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. తిరిగి అదే తరహాలో మహిళను అడ్డగించడంపై పోలీసులు దృష్టి పెట్టారు. గంజాయి మత్తులో రెచ్చిపోతున్న వారిని కట్టడి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..