పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ శుభవార్త. రాజకీయ కార్యకలాపాల కారణంగా ఓజీ 2 ఆలస్యం అవుతుందని భావించిన వేళ, పవన్ క్రియేటివ్ వర్క్స్ నుండి వచ్చిన అనూహ్య అప్డేట్ అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. దర్శకుడు సుజిత్ విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత స్క్రిప్ట్‌పై చర్చించి, తదుపరి అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. సంగీత దర్శకుడు తమన్ రీట్వీట్‌తో మరింత ఉత్సాహం నెలకొంది.