AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitish Kumar Reddy: మనసులు గెలిచేశావ్ పో.. అమ్మంటే ఎంత ప్రేమ బ్రో నీకు! క్యూట్ వీడియో..

ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే విజయం తర్వాత టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నాడు. బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు తీసిన నితీష్‌కు ప్రెస్ మీట్ మధ్యలో అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి, 'అమ్మ నేను మళ్లీ చేస్తాను' అంటూ అతను స్పందించిన తీరు వైరల్ అయ్యింది.

Nitish Kumar Reddy: మనసులు గెలిచేశావ్ పో.. అమ్మంటే ఎంత ప్రేమ బ్రో నీకు! క్యూట్ వీడియో..
Nitish Kumar Reddy
SN Pasha
|

Updated on: Jun 14, 2026 | 9:04 AM

Share

ఆఫ్ఘనిస్థాన్‌తో శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్ తర్వాత టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్, మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నాడు. మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు నితీష్. అయితే ప్రెస్ మీట్ మధ్యలో నితీష్‌కు వాళ్ల అమ్మ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సాధారణంగా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ తర్వాత, ఎదురుగా పదుల సంఖ్యలో రిపోర్టర్లు ఉన్నప్పుడు, ఏ ఫోన్ వచ్చినా స్పందించరు. మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలపైనే దృష్టి పెడతారు.

కానీ, అక్కడ ఫోన్ చేస్తోంది అమ్మ. ఆమె కంటే ఈ లోకంలో ఎవరు ఎక్కువ చెప్పండి. నితీష్ కూడా ఇదే ఫీలై ఉంటాడు. ప్రెస్ మీట్ మధ్యలో.. ఒక్క నిమిషం అంటూ.. అమ్మ కాల్ లిఫ్ట్ చేసి.. ‘అమ్మ నేను మళ్లీ చేస్తాను.. ఒక 5 నిమిషాల్లోనే నేను కాల్ చేస్తాను’ అంటూ సమాధానం చెప్పి పెట్టేశాడు. ప్రెస్ మీట్ మధ్యలో కాల్ లిఫ్ట్ చేసినందుకు మీడియా వాళ్లకు సారీ చెప్పినప్పటికీ.. అమ్మ కంగారు పడొద్దని, ముందు ఫోన్ లిఫ్ట్ చేసి, తర్వాత చేస్తాను అని చాలా క్యూట్‌గా చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అమ్మంటే నీకు ఎంత ప్రేమ బ్రో.. మన హృదయాలు గెలుచుకున్నావ్ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

వీడియో చూడండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?