AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. రుక్మిణి కోట సంచలన ప్రకటన!

ఏపీలో జనసేన నేతల పేర్లు ఉపయోగించి నిరుద్యోగుల నుంచి రూ.7కోట్లు వసూలు చేసిన కేసులో సీఐడీ దూకుడు పెంచింది. జనసేన నేతలు కోటా రుక్మిణి, కళ్యాణం శివ శ్రీనివాస్ పేర్లు ఉపయోగించి 35 మంది దగ్గర నుంచి.. ధరణీ కృష్ణ, పెద్దిరాజు ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశారని తేల్చారు. జనసేన నాయకుల పేర్లు చెప్పి ఏడు కోట్లు కొల్లగొట్టిందెవరు? ఈ కేసులో రంగంలోకి దిగిన సీఐడీ ఎటువంటి చర్యలు తీసుకుంది?. కేసుపై జనసేన నేతల నుంచి రియాక్షన్ ఏంటి?. అసలు ఇందులో బాధితులు ఎంతమంది?

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. రుక్మిణి కోట సంచలన ప్రకటన!
Kota Rukmini Responds
Balaraju Goud
|

Updated on: Nov 19, 2026 | 7:14 AM

Share

ఏపీలో జనసేన నేతల పేర్లు ఉపయోగించి నిరుద్యోగుల నుంచి రూ.7కోట్లు వసూలు చేసిన కేసులో సీఐడీ దూకుడు పెంచింది. జనసేన నేతలు కోటా రుక్మిణి, కళ్యాణం శివ శ్రీనివాస్ పేర్లు ఉపయోగించి 35 మంది దగ్గర నుంచి.. ధరణీ కృష్ణ, పెద్దిరాజు ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశారని తేల్చారు. జనసేన నేతల ఫిర్యాదుతో ధరణీ కృష్ణ, పెద్దిరాజులపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. డబ్బుల వసూలు వ్యవహారంలో ధరణీ కృష్ణ, పెద్దిరాజును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

రూ.7 కోట్ల స్కాంపై జనసేన నేత కోట రుక్మిణి స్పందించారు. తన మౌనం సంయమనం.. సహనం నా బలం అంటూ ప్రకటన విడుదల చేశారు. కొన్నాళ్లుగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, తప్పుడు కథనాలతో వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని చెప్పారు. తన పేరు, సంస్థను ఉపయోగించుకుని కొందరు లబ్ధిపొందారని వివరించారు. తనకు తెలియకుండా మోసం జరిగిందని, అంతర్గత విచారణ తర్వాత ఉద్యోగిని తొలగించామన్నారు. వ్యక్తిగత ప్రతిష్ఠ, కుటుంబ గౌరవం కోసం న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. పవన్ సహనం, పట్టుదల, ధైర్యమే తనకు స్ఫూర్తి అని చెబుతూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు కోట రుక్మిణి. అసలు నిందితులను వదిలి నన్ను టార్గెట్ చేస్తున్నారని, ఈ కేసులో చర్యలు తీసుకోవాలని పోలీసులకు తానే ఫిర్యాదు చేశానన్నారు. ఈ వివాదంలోకి పవన్‌ పేరును లాగొద్దని కోరారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతోందన్నారు పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్యాణం శ్రీనివాస్‌. కావాలని తమపై బురద జల్లుతున్నారని ఆరోపించారు.

జనసేన నేతల పేర్లు చెప్పి.. ఉద్యోగాల పేరుతో కోట్లు వసూలు చేయడంపై విపక్షం విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే.. ఈ విషయాన్ని అటు జనసేన, ఇటు ప్రభుత్వం సైతం సీరియస్‌గా తీసుకుంది. సీఐడీతో ఎంక్వైరీకి జరుపుతుండటంతో.. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది తేల్చే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జనసేన నేతల పేరుతో రూ. 7 కోట్లు కొల్లగొట్టిందెవరు?
జనసేన నేతల పేరుతో రూ. 7 కోట్లు కొల్లగొట్టిందెవరు?
కివీస్ కెప్టెన్ లాథమ్ ఖాతాలో చెత్త రికార్డు
కివీస్ కెప్టెన్ లాథమ్ ఖాతాలో చెత్త రికార్డు
3 మ్యాచ్‌ల్లో 3 సార్లు.. హెడ్‌కు పీడకలగా మారిన అట్కిన్సన్
3 మ్యాచ్‌ల్లో 3 సార్లు.. హెడ్‌కు పీడకలగా మారిన అట్కిన్సన్
పెళ్లి చేయలేదనీ.. పెట్రోల్ పోసి సొంత ఇంటికే నిప్పు పెట్టిన కొడుకు
పెళ్లి చేయలేదనీ.. పెట్రోల్ పోసి సొంత ఇంటికే నిప్పు పెట్టిన కొడుకు
3 రోజుల్లోనే 32 లక్షల వ్యూస్.. OTTని ఊపేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్
3 రోజుల్లోనే 32 లక్షల వ్యూస్.. OTTని ఊపేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్
ఏపీకి 'అక్వాన్' ముప్పు తప్పినట్లేనా? దిశ మార్చుకున్న తుపాను..
ఏపీకి 'అక్వాన్' ముప్పు తప్పినట్లేనా? దిశ మార్చుకున్న తుపాను..
ఆ ఇద్దరు భారత రత్నాలు.. విఫలమయ్యారని వదిలేస్తారా..
ఆ ఇద్దరు భారత రత్నాలు.. విఫలమయ్యారని వదిలేస్తారా..
3 ఏళ్ల చిన్నారిని తాడుతో కట్టేసి వేధించిన స్కూల్ సిబ్బంది! వీడియో
3 ఏళ్ల చిన్నారిని తాడుతో కట్టేసి వేధించిన స్కూల్ సిబ్బంది! వీడియో
గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధర
గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధర
Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్..
Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్..