AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aqwan Cyclone: ఏపీకి ‘అక్వాన్’ ముప్పు తప్పినట్లేనా? దిశ మార్చుకున్న తుపాను.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

అక్వాన్ తుపాను దిశ మార్చుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యక్ష తుపాను ముప్పు తగ్గినట్లు కనిపిస్తోంది. తొలుత ఏపీ తీరం వైపు వస్తుందని భావించిన తుపాను ప్రస్తుతం దక్షిణ ఒడిశా వైపు పయనిస్తోంది. అయితే ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలకు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు..

Aqwan Cyclone: ఏపీకి 'అక్వాన్' ముప్పు తప్పినట్లేనా? దిశ మార్చుకున్న తుపాను.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Aqwan Cyclone Changes Direction
Srilakshmi C
|

Updated on: Nov 19, 2026 | 6:30 AM

Share

అమరావతి, నవంబర్‌ 19: ఆంధ్రప్రదేశ్‌కు అక్వాన్ తుపాను ముప్పు కొంతవరకు తప్పినట్లుగా కనిపిస్తోంది. తొలుత మచిలీపట్నం–చెన్నై మధ్య, ఆ తర్వాత కాకినాడ–విశాఖపట్నం మధ్య తీరం దాటుతుందని అంచనా వేసిన ఈ తుపాను తాజాగా దిశ మార్చుకుంది. దక్షిణ ఒడిశా వైపు పయనిస్తున్నట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. అయితే తుపాను గమనం పూర్తిగా స్పష్టమయ్యే వరకు ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్వాన్ తుపాను మొదటి నుంచి నెమ్మదిగా కదులుతోంది. గంటకు 3 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ సముద్రంలోనే కొంత బలహీనపడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉప ఉష్ణమండల అధిక పీడన ప్రభావంతో దిశ మార్చుకున్నట్లు ఆంధ్రా యూనివర్సిటీ వాతావరణ విభాగాధిపతి ఆచార్య సీవీ నాయుడు తెలిపారు. ప్రస్తుతం దక్షిణ ఒడిశా వైపు పయనిస్తున్నప్పటికీ.. కోల్‌కతా, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల వైపు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ కొన్ని తుపాన్లు ఇదే తరహాలో గమనాన్ని మార్చుకున్నాయని వివరించారు.

తీవ్ర తుపానుగా కొనసాగుతున్న అక్వాన్

దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం రాత్రి నాటికి గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతూ పలు ప్రాంతాలకు సమీపంలో కేంద్రీకృతమైంది.

  • నరసాపురానికి 500 కిలోమీటర్ల దూరంలో
  • కళింగపట్నానికి 540 కిలోమీటర్ల దూరంలో
  • గోపాల్‌పూర్‌కు 630 కిలోమీటర్ల దూరంలో
  • పూరీకి 690 కిలోమీటర్ల దూరంలో

గురువారం అర్ధరాత్రి వరకు తీవ్ర తుపానుగానే కొనసాగుతుందని, శుక్రవారం మధ్యాహ్నానికి తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నరసాపురం–పూరీ మధ్య తీరం దాటే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుత గమనం ప్రకారం దక్షిణ ఒడిశా వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపింది. ఒకవేళ గమనం మారితే శ్రీకాకుళం–పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. అక్వాన్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి
  • శ్రీకాకుళం
  • విజయనగరం
  • విశాఖపట్నం
  • అనకాపల్లి
  • అల్లూరి సీతారామరాజు
  • కాకినాడ

ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నవంబర్ 20న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. తుపాను దిశ మారడంతో రాష్ట్రానికి ప్రత్యక్ష ముప్పు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఉత్తరాంధ్ర జిల్లాలపై వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటించాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Follow Us
ఏపీకి 'అక్వాన్' ముప్పు తప్పినట్లేనా? దిశ మార్చుకున్న తుపాను..
ఏపీకి 'అక్వాన్' ముప్పు తప్పినట్లేనా? దిశ మార్చుకున్న తుపాను..
ఆ ఇద్దరు భారత రత్నాలు.. విఫలమయ్యారని వదిలేస్తారా..
ఆ ఇద్దరు భారత రత్నాలు.. విఫలమయ్యారని వదిలేస్తారా..
3 ఏళ్ల చిన్నారిని తాడుతో కట్టేసి వేధించిన స్కూల్ సిబ్బంది! వీడియో
3 ఏళ్ల చిన్నారిని తాడుతో కట్టేసి వేధించిన స్కూల్ సిబ్బంది! వీడియో
గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధర
గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధర
Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్..
Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్..
నవంబర్ 19 రాశిఫలాలు..ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్
నవంబర్ 19 రాశిఫలాలు..ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్
వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా..
వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా..
కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం చేయలేకపోతున్నారా?...
కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం చేయలేకపోతున్నారా?...
'రామాయణ' సినిమా ప్రదర్శనను నిలిపేయాలి..హిందూ జాగృతి సమితి డిమాండ్
'రామాయణ' సినిమా ప్రదర్శనను నిలిపేయాలి..హిందూ జాగృతి సమితి డిమాండ్
తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము..
తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము..