Video: 3 మ్యాచ్‌ల్లో 3 సార్లు.. హెడ్‌కు పీడకలగా మారాడుగా.. ఇక నిద్రలేని రాత్రులే..!
Gus Atkinson vs Travis Head: ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. మూడు వన్డేల్లో మూడుసార్లు ఔట్ చేశాడు. హోబర్ట్‌లో డకెట్ శతకంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. ఆ పోరు విశేషాలు, హెడ్ వైఫల్యం వెనుక కారణాల పూర్తి కారణాలు ఓసారి చూద్దాం..!

Gus Atkinson vs Travis Head: ఆస్ట్రేలియా పర్యటనలో ఇంగ్లండ్‌కు ఓదార్పు దొరికింది. అది బ్యాట్‌తో కాదు, బంతితో. కుడిచేతి పేసర్ గస్ అట్కిన్సన్ ఆసీస్ డేంజర్ మ్యాన్ ట్రావిస్ హెడ్‌కు నిద్రలేని రాత్రులు మిగులుస్తున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో మూడుసార్లు అతన్నే బలి చేశాడు. ఇది యాదృచ్ఛికం కాదు, పక్కా ప్రణాళికతో వేసిన ఉచ్చు అనే చెప్పాలి. ఫార్మాట్ ఏదైనా హెడ్ ఆస్ట్రేలియా అత్యంత ప్రమాదకర బ్యాటర్. అలాంటి ఆటగాడు అట్కిన్సన్ ముందు తడబడటం సిరీస్‌కే హైలైట్‌గా మారింది.
మూడు మ్యాచ్‌లు, మూడు భిన్న బంతులు, ఒకటే ఫలితం..
1. పెర్త్ తొలి వన్డే – డకౌట్‌తో శుభారంభం:
ఒక్క బంతి మాత్రమే ఎదుర్కొన్న హెడ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. వికెట్ చుట్టూ వచ్చి నిండు లెంగ్త్ బంతిని లోపలికి వంచాడు అట్కిన్సన్. ఫుట్ వర్క్ లేకుండా డ్రైవ్‌కు యత్నించిన హెడ్ బ్యాట్ మందపాటి లోపలి అంచుకు తగిలి బంతి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది.
ఎక్కువమంది చదివినది: Video: 13 సిక్సర్లు, 8 ఫోర్లతో ఊహించని విధ్వంసం.. 281 స్ట్రైక్‌రేట్‌తో కోహ్లీ దోస్త్ రికార్డుల మోత..!
2. అడిలైడ్ రెండో వన్డే – స్లిప్‌లో చిక్కాడు:
8 బంతుల్లో 7 పరుగులు చేసి మళ్లీ అట్కిన్సన్‌కే చిక్కాడు. ఆఫ్ స్టంప్ వెలుపల బ్యాక్-ఆఫ్-లెంగ్త్ బంతిని స్క్వేర్ కట్ చేయబోయాడు. రూమ్ లేకపోవడంతో బ్యాట్ అంచుకు తగిలి స్లిప్‌లో జో రూట్ చేతికి చిక్కింది.
3. హోబర్ట్ మూడో వన్డే – హ్యాట్రిక్ పూర్తి:
బెల్లెరీవ్ ఓవల్‌లో తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. 3 బంతుల్లో 4 పరుగులకే హెడ్ ఔట్. ఆఫ్ స్టంప్ వెలుపల స్క్రాంబుల్డ్-సీమ్ బంతిని షార్ట్ కాకున్నా కట్ చేయబోయాడు. మందపాటి వెలుపలి అంచు తగిలి ఫస్ట్ స్లిప్‌లో రూట్‌కు సులువైన క్యాచ్‌గా వెళ్లింది.
Sonny Baker Gets Mitchell Marsh Once Again. Sonny Baker Is The New Daddy Of Mitchell Marsh. Both Australian Openers Gone. England Is On Fire. Australia Is Getting Destroyed
— Aryan Goel 2.0 (@AryanGoelNew) November 18, 2026
వెటరన్ విశ్లేషణలో చెప్పాలంటే – మూడు డిస్మిసల్స్ మూడు రకాలు. ఒకటి బౌల్డ్, రెండు స్లిప్ క్యాచ్‌లు. కానీ సారాంశం ఒక్కటే – హెడ్ మనసులో అట్కిన్సన్ భయం నాటుకుపోయింది.
డకెట్ మెరుపు శతకం – ఇంగ్లండ్ 328!
Gus Atkinson Is Going To Own Travis Head Once Again. Travis Head Averages Just 3 In This Series Against Gus Atkinson. Gus Atkinson Is A Nightmare For Travis Head. Gus Atkinson Will Destroy Travis Head Today As Well https://t.co/BdtZBYCCyk
— Aryan Goel 2.0 (@AryanGoelNew) November 18, 2026
టాస్ ఓడి ముందు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 48.3 ఓవర్లలో 328 పరుగులు చేసింది. ఆరంభ వికెట్లు పడినా బెన్ డకెట్ ఒంటరి పోరాటం చేశాడు. 115 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 133 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. టామ్ బాంటన్ 35 బంతుల్లో 44, చివర్లో విల్ జాక్స్ 48 బంతుల్లో 59 పరుగులతో జోరు పెంచాడు. రూట్ 12, హ్యారీ బ్రూక్ 17 పరుగులకే పరిమితమయ్యారు. మధ్య ఓవర్లలో వికెట్లు పడినా 300 మార్కును దాటడం ఇంగ్లండ్‌కు ఊరట.
ఎక్కువమంది చదివినది: IPL 2027 Retention: రిటెన్షన్ తర్వాత మారిన లెక్కలు.. పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?
ఆస్ట్రేలియా బౌలింగ్‌లో జేవియర్ బార్ట్‌లెట్, జాక్ ఎడ్వర్డ్స్, కూపర్ కొన్నోల్లీ, మ్యాట్ రెన్‌షాతో పాటు హెడ్ కూడా వికెట్లు తీయడం విశేషం.
మ్యాచ్ తర్వాత డకెట్ మాట్లాడుతూ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు: “అవును, నిజమే. పెర్త్ ఆప్టస్ స్టేడియం కంటే ఈ పిచ్ మాకు బాగా సూటయింది. పవర్‌ప్లేలో కాస్త నెమ్మదిగా ఉంది. ఇంగ్లండ్ వికెట్‌లా అనిపించింది, మాకు అలవాటైన పరిస్థితులే. మంచి పిచ్, చివర్లో కాస్త నెమ్మదించింది. కొన్ని పరుగులు వదిలేశాం, కానీ 330 అంటే ఎప్పుడూ మంచి స్కోరే.”
మధ్యలో భాగస్వామ్యం నెలకొల్పలేకపోయామని, ఆసీస్ స్పిన్నర్లు పరిస్థితులను బాగా వాడుకున్నారని డకెట్ ఒప్పుకున్నాడు. ఛేజింగ్‌లో స్టంప్స్ చుట్టూ బంతులేసి, లెంగ్త్‌లు మారుస్తూ కట్టడి చేస్తామని చెప్పాడు. అట్కిన్సన్ ఇప్పటికే హెడ్‌ను భయపెడుతుండటంతో అదే ఒత్తిడిని కొనసాగించాలని ఇంగ్లండ్ ఆశిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




