AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: దారుణం.. మూడేళ్ల చిన్నారి చేతులు తాడుతో కట్టేసి వేధించిన స్కూల్ సిబ్బంది!

మూడేళ్ల ప్రీ-కేజీ చిన్నారి చేతులను తాడుతో కట్టేసి పాఠశాల సిబ్బంది వేధించారు. బాలుడి శరీరంపై గాయాలు గుర్తించిన తండ్రి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా షాకింగ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై ఉపాధ్యాయురాలు, పారిశుద్ధ్య కార్మికురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

Watch Video: దారుణం.. మూడేళ్ల చిన్నారి చేతులు తాడుతో కట్టేసి వేధించిన స్కూల్ సిబ్బంది!
Three Year Old Boy Tied Up And Mistreated In Classroom
Srilakshmi C
|

Updated on: Nov 19, 2026 | 6:16 AM

Share

తిరువారూరు, నవంబర్‌ 19: తమిళనాడులోని తిరువారూరు సమీపంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల ప్రీ-కేజీ విద్యార్థి చేతులను తాడుతో కట్టేసి, పాఠశాల సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఉపాధ్యాయురాలు, పారిశుద్ధ్య కార్మికురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాల సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తిరుత్తురైపూండికి చెందిన బి. గోపీనాథ్ ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆయన కుమారుడు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బాలుడి ముఖం, శరీరంపై గాయాలు కనిపించాయి. దీంతో తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించగా.. పాఠశాల సిబ్బంది తనను తరగతి గదిలో కొట్టారని చిన్నారి చెప్పాడు.

దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి వెంటనే పాఠశాలకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీ చూపించాలని డిమాండ్ చేశారు. వీడియోలను పరిశీలించగా.. చిన్నారి చేతులను తాడుతో కట్టేసి సిబ్బంది వేధిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికురాలు బాలుడిని గోడకు వేలాడదీసిన డిజిటల్ బ్యానర్ వైపు బలంగా నెట్టినట్లు కూడా ఫుటేజీలో నమోదైంది. చిన్నారి నొప్పితో ఏడుస్తున్న దృశ్యాలు తండ్రిని తీవ్రంగా కలచివేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసుకున్న గోపీనాథ్.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తిరుత్తురైపూండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు పాఠశాలను సందర్శించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయురాలు ఆర్. బాక్యలక్ష్మి (26), పారిశుద్ధ్య కార్మికురాలు ఎం. సెల్వి (55)పై కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత వారిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈలోగా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 115(2), 127(2), 125 కింద దాడి, అక్రమ నిర్బంధం, ప్రాణాలకు ప్రమాదం కలిగించడం వంటి అభియోగాలతో కేసు నమోదు చేశారు. అలాగే బాలలపై క్రూరత్వానికి సంబంధించి జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 75, పాఠశాలల్లో శారీరక శిక్షలను నిషేధించే విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 17ను కూడా కేసులో చేర్చారు.

View this post on Instagram

A post shared by SS News (@ssnewsdigital)

మరోవైపు, ఈ ఘటనపై పాఠశాల విద్యాశాఖ విచారణ ప్రారంభించింది. ప్రాథమిక ఆధారాల ఆధారంగా కేసు నమోదు చేశామని, విద్యాశాఖ విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తిరువారూరు జిల్లా ఎస్పీ వి. సతీష్ కుమార్ తెలిపారు. చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పాఠశాలల్లోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us
3 ఏళ్ల చిన్నారిని తాడుతో కట్టేసి వేధించిన స్కూల్ సిబ్బంది! వీడియో
3 ఏళ్ల చిన్నారిని తాడుతో కట్టేసి వేధించిన స్కూల్ సిబ్బంది! వీడియో
గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధర
గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధర
Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్..
Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్..
నవంబర్ 19 రాశిఫలాలు..ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్
నవంబర్ 19 రాశిఫలాలు..ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్
వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా..
వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా..
కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం చేయలేకపోతున్నారా?...
కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం చేయలేకపోతున్నారా?...
'రామాయణ' సినిమా ప్రదర్శనను నిలిపేయాలి..హిందూ జాగృతి సమితి డిమాండ్
'రామాయణ' సినిమా ప్రదర్శనను నిలిపేయాలి..హిందూ జాగృతి సమితి డిమాండ్
తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము..
తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము..
రాత్రిపూట పీడకలలు వస్తున్నాయా? నిద్రపోయే ముందు ఈ పనులు చేయండి!
రాత్రిపూట పీడకలలు వస్తున్నాయా? నిద్రపోయే ముందు ఈ పనులు చేయండి!
తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం
తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం