AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధరలు..!

Gold, Silver Prices: ఇక తాజాగా దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. రోజు రోజుకు వేలల్లో తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో గ్రాము బంగారం కొనాలంటేనే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యుడు సైతం కొనుగోలు చేసే విధంగా ధరలు..

Gold Price Today: గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధరలు..!
Gold Rate Today
Subhash Goud
|

Updated on: Nov 19, 2026 | 6:13 AM

Share

Gold, Silver Prices Today: దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు వరుసగా ఆరో సెషన్‌లోనూ రేట్లు భారీగా పడిపోతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం ఏకంగా 3800 డాలర్ల మార్కు దిగువకు చేరింది. అంటే గతేడాది సెప్టెంబరులో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఈ స్థాయిలో కొనసాగింది. అక్కడి నుంచి భారీగా పెరిగి ఈ ఏడాది జనవరి చివర్లో ఏకంగా ఔన్సుకు 5600 డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. అంటే గరిష్ఠ స్థాయిల నుంచి పసిడి ధర 30 శాతానికిపైగా పడిపోయింది. సిల్వర్ రేటు చూస్తే మరీ ఎక్కువగా పడిపోయింది. అదే జనవరిలో ఔన్సుకు 121 డాలర్ల స్థాయిలో గరిష్ఠాల్ని తాకగా ఇప్పుడు అది 46 డాలర్లకు చేరింది. ఇది 60 శాతానికిపైగా పతనాన్ని చూయిస్తుంది.

ఇక తాజాగా దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. రోజు రోజుకు వేలల్లో తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో గ్రాము బంగారం కొనాలంటేనే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యుడు సైతం కొనుగోలు చేసే విధంగా ధరలు అమాంతంగా దిగి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,250 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,140 వద్ద కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే దాదాపు 3 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. వెండిపై 5 వేల రూపాయల వరకు తగ్గింది.

విజయవాడలో కూడా ఇదే ధరతో కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికొస్తే..1,84,900 వద్ద ట్రేడవుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,290 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,250 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,140 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,250 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,140 వద్ద కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే దాదాపు 3 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. వెండిపై 5 వేల రూపాయల వరకు తగ్గింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధర
గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధర
Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్..
Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్..
నవంబర్ 19 రాశిఫలాలు..ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్
నవంబర్ 19 రాశిఫలాలు..ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్
వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా..
వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా..
కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం చేయలేకపోతున్నారా?...
కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం చేయలేకపోతున్నారా?...
'రామాయణ' సినిమా ప్రదర్శనను నిలిపేయాలి..హిందూ జాగృతి సమితి డిమాండ్
'రామాయణ' సినిమా ప్రదర్శనను నిలిపేయాలి..హిందూ జాగృతి సమితి డిమాండ్
తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము..
తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము..
రాత్రిపూట పీడకలలు వస్తున్నాయా? నిద్రపోయే ముందు ఈ పనులు చేయండి!
రాత్రిపూట పీడకలలు వస్తున్నాయా? నిద్రపోయే ముందు ఈ పనులు చేయండి!
తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం
తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం
18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో తుఫాన్ సెంచరీ..
18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో తుఫాన్ సెంచరీ..