AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ 19 రాశిఫలాలు..ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్

Horoscope Today (19 November 2026): గురువారం కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపించనుంది. మరికొందరు పని ఒత్తిడి, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆర్థిక, కుటుంబ, వృత్తిపరమైన విషయాల్లో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఎదురుకానున్నాయి? నవంబర్ 19 గురువారం మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసుకోండి.

నవంబర్ 19 రాశిఫలాలు..ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్
Horoscope Today 19 November 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 19, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 19, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి చెందుతారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు, బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులు కాస్తంత ఎక్కువగా ఉపయోగిం చుకునే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి చెందుతారు. అదనపు ఆదాయానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమ వుతుంది. వ్యక్తిగత సమ స్యలు తగ్గుముఖం పడతాయి. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నం దువల్ల ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో బరువు, బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులు కాస్తంత ఎక్కువగా ఉపయోగిం చుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారా లను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆహార, విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రత్యర్థులు, పోటీదార్ల మీద బాగా పైచేయిగా ఉంటారు. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

చిన్న ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ముఖ్య మైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అష్టమ రాహువు ప్రభావం వల్ల మధ్య మధ్య ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో వ్యయ ప్రయాసలు తప్పకపో వచ్చు. అదనపు ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండా ల్సిన అవసరం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఆశించిన స్థాయిలో గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల కోసం వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్య నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. మిత్రుల నుంచి సహాయం లభి స్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. పిల్లలు పురోగతి సాధి స్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక, కుటుంబ వ్యవహారాలు క్రమంగా చక్కబడతాయి. ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులకు రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనులు, కార్యకలాపాలన్నీ నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మిత్రులతో విందులో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల్ని కలుసుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలు బాగా బిజీగా సాగుతాయి. వ్యాపారాల్లో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగ స్వామిని కూడా సంప్రదిస్తూ ఉండడం ఉత్తమం. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగుల మీద అదనపు బాధ్యతల భారం ఉంటుంది. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గే సూచనలున్నాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయాణాల్ని వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా పురోగమిస్తాయి. శుభ కార్యాలు, పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. గృహ, వాహనాల కొనుగోలుపై దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూలమైన వాతావరణం ఉంది. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

Follow Us
Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్..
Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్..
నవంబర్ 19 రాశిఫలాలు..ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్
నవంబర్ 19 రాశిఫలాలు..ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్
వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా..
వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా..
కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం చేయలేకపోతున్నారా?...
కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం చేయలేకపోతున్నారా?...
'రామాయణ' సినిమా ప్రదర్శనను నిలిపేయాలి..హిందూ జాగృతి సమితి డిమాండ్
'రామాయణ' సినిమా ప్రదర్శనను నిలిపేయాలి..హిందూ జాగృతి సమితి డిమాండ్
తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము..
తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము..
రాత్రిపూట పీడకలలు వస్తున్నాయా? నిద్రపోయే ముందు ఈ పనులు చేయండి!
రాత్రిపూట పీడకలలు వస్తున్నాయా? నిద్రపోయే ముందు ఈ పనులు చేయండి!
తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం
తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం
18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో తుఫాన్ సెంచరీ..
18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో తుఫాన్ సెంచరీ..
నీకెన్ని.. నాకెన్ని..? క్యూసెక్కుల లెక్కల్లోనే సీఎంల బిజీబిజీ..
నీకెన్ని.. నాకెన్ని..? క్యూసెక్కుల లెక్కల్లోనే సీఎంల బిజీబిజీ..