AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం, మహా దీప దర్శనం ఉచితం!

Tiruvannamalai Karthigai Deepam 2026: తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం సందర్భంగా భక్తులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈసారి భరణి దీపం, మహా దీప దర్శనానికి పూర్తిగా ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. మొత్తం 3,000 టిక్కెట్ల కోసం ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైంది. దరఖాస్తు గడువు, టిక్కెట్ల కేటాయింపు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకోండి.

తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం, మహా దీప దర్శనం ఉచితం!
Tiruvannamalai Karthigai Deepam 2026
Rajashekher G
|

Updated on: Nov 18, 2026 | 10:09 PM

Share

Tiruvannamalai Karthigai Deepam 2026: ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన తమిళనాడులోని తిరువణ్ణామలైలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడి అన్నామలైయార్ ఆలయంలో నిర్వహించే ఈ వేడుకను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా 2,668 అడుగుల ఎత్తైన అరుణాచల పర్వతంపై వెలిగించే మహా దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఈ ఏడాది కూడా కార్తీక దీపోత్సవానికి ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

నవంబర్ 24న ఉదయం భరణి దీపం, సాయంత్రం అరుణాచల పర్వతంపై మహా దీపాన్ని వెలిగించనున్నారు. ఈ నేపథ్యంలో దీపోత్సవాన్ని వీక్షించాలనుకునే భక్తులకు తమిళనాడు ప్రభుత్వం, హిందూ మత, దేవాదాయ శాఖ తీపికబురు అందించాయి. ఈసారి భరణి దీపం, మహా దీప దర్శనానికి పూర్తిగా ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఉచిత దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్

గతంలో భరణి దీపం, మహా దీప దర్శనానికి భక్తుల నుంచి ప్రవేశ రుసుము వసూలు చేసేవారు. అయితే ఈ ఏడాది తొలిసారిగా ఆ విధానాన్ని రద్దు చేసి ఉచిత దర్శన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించడంతోపాటు అందరికీ సమాన అవకాశం కల్పించేందుకు ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా మొత్తం 3,000 మంది భక్తులకు ఉచిత దర్శన టిక్కెట్లు కేటాయించనున్నారు. నవంబర్ 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

3,000 టిక్కెట్ల కేటాయింపు ఇలా..

భక్తులకు కేటాయించే ఉచిత టిక్కెట్లను రెండు విభాగాలుగా విభజించారు.

  • భరణి దీప దర్శనం: తిరువణ్ణామలై జిల్లాకు చెందిన 500 మంది, ఇతర జిల్లాలకు చెందిన 500 మంది భక్తులకు అవకాశం కల్పిస్తారు.
  • మహా దీప దర్శనం: తిరువణ్ణామలై జిల్లాకు చెందిన 1,000 మంది, ఇతర జిల్లాలకు చెందిన 1,000 మంది భక్తులను ఎంపిక చేస్తారు.
  • ఇలా మొత్తం 3,000 మందికి ఉచిత దర్శన అవకాశం లభించనుంది.

ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పొందడం ఎలా?

భక్తులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. అనంతరం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. నవంబర్ 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన భక్తులకు సంబంధించిన ఉచిత దర్శన టిక్కెట్లను SMS ద్వారా పంపిస్తారు.

గతేడాది టిక్కెట్లకు రుసుము.. ఈసారి ఉచితం!

గత ఏడాది భరణి దీపం, మహా దీప దర్శనానికి రూ.500 నుంచి రూ.600 వరకు రుసుము వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఈసారి భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పూర్తిగా ఉచిత దర్శన విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో సామాన్య భక్తులకు కూడా అరుణాచలేశ్వరుడి మహా దీపాన్ని దగ్గరగా వీక్షించే అవకాశం లభించనుంది.

కార్తీక దీపోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించాలనుకునే భక్తులు బుకింగ్ గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే టిక్కెట్లు పరిమిత సంఖ్యలోనే ఉండటంతో ఎంపికైన వారికి మాత్రమే ప్రత్యేక దర్శన అవకాశం లభిస్తుంది.

Follow Us
తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం
తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం
18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో తుఫాన్ సెంచరీ..
18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో తుఫాన్ సెంచరీ..
నీకెన్ని.. నాకెన్ని..? క్యూసెక్కుల లెక్కల్లోనే సీఎంల బిజీబిజీ..
నీకెన్ని.. నాకెన్ని..? క్యూసెక్కుల లెక్కల్లోనే సీఎంల బిజీబిజీ..
ఆ నటుడితో వర్క్ చేయడం ఒక పీడకల.. మాట్లాడే పద్ధతి కూడా తెలియదు
ఆ నటుడితో వర్క్ చేయడం ఒక పీడకల.. మాట్లాడే పద్ధతి కూడా తెలియదు
ఒక్క గ్లాస్ పోస్తే.. ఎండిపోతున్న తులసమ్మ గుబురుగా, పచ్చగా
ఒక్క గ్లాస్ పోస్తే.. ఎండిపోతున్న తులసమ్మ గుబురుగా, పచ్చగా
తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
భార్యల చేత శాపానికి గురైన ముగ్గురు దేవుళ్లు.. శని, బ్రహ్మ, సూర్య
భార్యల చేత శాపానికి గురైన ముగ్గురు దేవుళ్లు.. శని, బ్రహ్మ, సూర్య
సిద్దిపేట అభివృద్ధిపై ఫ్లెక్సీల రగడ.. సీఎం రేవంత్ పర్యటన వేళ..
సిద్దిపేట అభివృద్ధిపై ఫ్లెక్సీల రగడ.. సీఎం రేవంత్ పర్యటన వేళ..
హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం
హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం
నా కంటె చిన్నవాడైనా ఆ హీరో చాలా గొప్పోడు.. ఇవ్వడమే తెలుసు కానీ..
నా కంటె చిన్నవాడైనా ఆ హీరో చాలా గొప్పోడు.. ఇవ్వడమే తెలుసు కానీ..