AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె ఏం మాట్లాడిందో ముందు నాకు అర్ధం కాలేదు.. రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేష్ క్లారిటీ..

చిత్ర పరిశ్రమలో ఏ భాషలోనైనా సరే.. తమకు లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీని, అన్నం పెట్టిన పరిశ్రమను గౌరవించడం ప్రతి నటీనటుడి బాధ్యత. కానీ ఈమధ్య కాలంలో కొందరు హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు .

ఆమె ఏం మాట్లాడిందో ముందు నాకు అర్ధం కాలేదు.. రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేష్ క్లారిటీ..
Keerthy Suresh
Rajeev Rayala
|

Updated on: Nov 19, 2026 | 7:29 AM

Share

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మేనరికం వివాహాలు, హీరోయిన్ల పాత్రల ఎంపికపై బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా అక్క వెబ్ సిరీస్ ప్రమోషన్ల సమయంలో రాధిక చేసిన వ్యాఖ్యల పక్కనే ఉన్న కీర్తి సురేష్ నవ్వుతూ స్పందించడం వివాదానికి కారణమైంది. ఈ క్రమంలో కీర్తి కూడా దక్షిణాది సంప్రదాయాలను సమర్థించారంటూ పలువురు విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ అంశంపై కీర్తి సురేష్ నేరుగా స్పందించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గతంలో తెలుగు సినిమాల్లో నటించిన అనుభవాలను గుర్తుచేసుకున్న రాధికా ఆప్టే.. తనకు ఎదురైన కొన్ని ఇబ్బందికర పరిస్థితుల గురించి మాట్లాడారు. తనకంటే ఎక్కువ వయసున్న హీరోతో రొమాన్స్ చేయాల్సి రావడం, కథలో భాగంగా మేనమామ పాత్రలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకునే సన్నివేశాల్లో నటించడం తనకు అసౌకర్యంగా అనిపించిందని తెలిపారు. అంతేకాకుండా సినిమాలో మధ్యలోనే తన పాత్ర చనిపోవడం కూడా నచ్చలేదని పేర్కొన్నారు.

రాధికా ఆప్టే సినిమా పేరు చెప్పకపోయినా.. ఆమె వ్యాఖ్యలు బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ చిత్రాన్ని ఉద్దేశించేనని నెటిజన్లు చర్చించుకున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కథ, పాత్ర నచ్చకపోతే అప్పట్లోనే సినిమా ఎందుకు అంగీకరించారంటూ పలువురు ప్రశ్నించగా, నిర్మాత ఎస్‌కేఎన్ సైతం ఆమె వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో తాజాగా తన కొత్త చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’ ప్రమోషన్లలో కీర్తి సురేష్‌కు ఇదే అంశంపై ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె రాధికా ఆప్టే మాట్లాడిన సమయంలో ఆమె వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం తనకు మొదట్లో అర్థం కాలేదని కీర్తి తెలిపారు. ఆ తర్వాత ఆమె దక్షిణాది ప్రాంతాల్లో ఉన్న మేనరికం వివాహ సంప్రదాయం గురించి మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్నట్లు వెల్లడించారు. దక్షిణాది సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడుతూ.. వాటిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని కీర్తి స్పష్టం చేశారు. ఉత్తరాది వారికి దక్షిణాదిలోని కొన్ని ఆచారాల గురించి పూర్తిగా తెలియకపోవచ్చని, అలాంటప్పుడు వాటి గురించి వివరించడం మాత్రమే చేయగలనని అన్నారు. మన సంప్రదాయాలను ఇతరులకు నిరూపించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల్లో మేనరికం వివాహాలు జరిగే సంప్రదాయం ఉందని, కేరళలో మాత్రం అలాంటి ఆచారం లేదని తాను గతంలో వివరించినట్లు కీర్తి గుర్తుచేశారు. కర్ణాటకలో ఈ సంప్రదాయం ఉందో లేదో తనకు కచ్చితంగా తెలియదని కూడా పేర్కొన్నారు. అయితే కీర్తి సురేష్ ఇచ్చిన వివరణతో ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. సోషల్ మీడియాలో మరోసారి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కీర్తి తన సంస్కృతి పట్ల గౌరవాన్ని వ్యక్తం చేశారని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరు మాత్రం రాధికా ఆప్టే అసలు ఉద్దేశం సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు, హీరోలతో వయసు గురించి మాట్లాడటమేనని అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో రాధిక వ్యాఖ్యలకు కీర్తి స్పందించిన తీరు ఒకలా ఉండగా, ఇప్పుడు వివరణ మరోలా ఉందంటూ కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇద్దరి వ్యాఖ్యలను వేర్వేరుగా చూడాలని సూచిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆమె ఏం మాట్లాడిందో ముందు నాకు అర్ధం కాలేదు..
ఆమె ఏం మాట్లాడిందో ముందు నాకు అర్ధం కాలేదు..
జనసేన నేతల పేరుతో రూ. 7 కోట్లు కొల్లగొట్టిందెవరు?
జనసేన నేతల పేరుతో రూ. 7 కోట్లు కొల్లగొట్టిందెవరు?
కివీస్ కెప్టెన్ లాథమ్ ఖాతాలో చెత్త రికార్డు
కివీస్ కెప్టెన్ లాథమ్ ఖాతాలో చెత్త రికార్డు
3 మ్యాచ్‌ల్లో 3 సార్లు.. హెడ్‌కు పీడకలగా మారిన అట్కిన్సన్
3 మ్యాచ్‌ల్లో 3 సార్లు.. హెడ్‌కు పీడకలగా మారిన అట్కిన్సన్
పెళ్లి చేయలేదనీ.. పెట్రోల్ పోసి సొంత ఇంటికే నిప్పు పెట్టిన కొడుకు
పెళ్లి చేయలేదనీ.. పెట్రోల్ పోసి సొంత ఇంటికే నిప్పు పెట్టిన కొడుకు
3 రోజుల్లోనే 32 లక్షల వ్యూస్.. OTTని ఊపేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్
3 రోజుల్లోనే 32 లక్షల వ్యూస్.. OTTని ఊపేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్
ఏపీకి 'అక్వాన్' ముప్పు తప్పినట్లేనా? దిశ మార్చుకున్న తుపాను..
ఏపీకి 'అక్వాన్' ముప్పు తప్పినట్లేనా? దిశ మార్చుకున్న తుపాను..
ఆ ఇద్దరు భారత రత్నాలు.. విఫలమయ్యారని వదిలేస్తారా..
ఆ ఇద్దరు భారత రత్నాలు.. విఫలమయ్యారని వదిలేస్తారా..
3 ఏళ్ల చిన్నారిని తాడుతో కట్టేసి వేధించిన స్కూల్ సిబ్బంది! వీడియో
3 ఏళ్ల చిన్నారిని తాడుతో కట్టేసి వేధించిన స్కూల్ సిబ్బంది! వీడియో
గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధర
గోల్డ్‌ మార్కెట్‌ ఢమాల్‌.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధర