మెనోపాజ్ అనేది ముగింపు కాదు.. మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి..

Rajitha Chanti

Pic credit - Instagram

18 November 2026

మహిళల జీవితంలో మెనోపాజ్ దశ అనేది శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులను తెస్తుంది. తాజాగా దీని గురించి నటి రమ్యకృష్ణ మాట్లాడారు.

శరీరంలో శక్తి స్థాయిలు తగ్గడం, నిద్రలేమి సమస్యలు, కీళ్ల నొప్పులు, హార్మోన్ల అసమతుల్యత కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయని అన్నారు.

అయితే ఈ సమయమే జీవితానికి ముగింపు కాదని, సరైన ఆలోచనలు, ఆరోగ్యకరమైన అలవాట్లతో ఈ దశను కూడా ఎంతో ప్రశాంతంగా అధిగమించవచ్చని అన్నారు. 

జీవితాంతం కుటుంబం కోసం, ఇతరుల కోసం కష్టపడుతూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే మహిళలు.. తమ గురించి తాము ఆలోచించుకోవాలన్నారు.

ముఖ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. హార్మోన్ల మార్పుల కారణంగా చిన్న సమస్య పెద్దదిగా అనిపిస్తుంది.

ముందుగా మానసిక ప్రశాంతతను చేకూర్చే ధ్యానం లేదా ఇతర పద్ధతులను పాటించాలి. మెనోపాజ్ తర్వాత శరీరంలో ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. 

బలహీనత వంటి సమస్యలు వస్తాయి. శరీరానికి తగిన బలాన్నిచ్చే వ్యాయామాలు, కండరాల పటిష్టతకు అవసరమైన శారీరక శ్రమ చేయడం ఎంతో అవసరం.

బలమైన కండరాలు శరీరాన్ని పదిలంగా ఉంచడంతో పాటు, ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతాయి. తమను తాము సంతోషంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు.