మెగాఫోన్ పడుతున్న కుర్ర హీరోలు.. సాహసమనే చెప్పాలేమో..?
టాలీవుడ్‌లో యువ హీరోలు ఇప్పుడు నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించగా, ఇప్పటికే విశ్వక్ సేన్, రామ్, విశాల్ వంటి హీరోలు కూడా మెగాఫోన్ పట్టారు. తమ కథలను తామే తెరకెక్కిస్తూ నటుడు-దర్శకులుగా కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు.
ఇన్నాళ్లూ తెరమీద నటులుగా సత్తా చూపించిన కుర్ర హీరోలు ఇప్పుడు తెరవెనక్కి వెళ్లి మెగాఫోన్ పడుతున్నారు. స్క్రీన్ మీద కూడా వాళ్లే కనిపిస్తున్నారు.. తమ కథలు తామే రాసుకుంటున్నారు. తమ సినిమాలో తామే హీరో అయిపోతున్నారు. దానికి కర్త కర్మ క్రియ అన్నీ తామే అంటున్నారు. తాజాగా మరో కుర్ర హీరో కూడా డైరెక్టర్ అయిపోయారు. యాక్టర్ కిరణ్ అబ్బవరం కాస్తా డైరెక్టర్ అయిపోయారు. స్వీయ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు ఈ హీరో. ఇన్నాళ్లు ఇతరుల కథల్లో నటించిన ఈ హీరో.. ఇప్పుడు సొంత కథలో కథానాయకుడిగా మారిపోయారు. చాగంటి సుధాకర్ నిర్మాణంలో కిరణ్ అబ్బవరం సినిమా జూన్ 12న మొదలు కానుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా షురూ చేయనున్నారు. కిరణ్ అబ్బవరంకు కథ రాయడం కొత్తేం కాదు.. గతంలో ఆయన నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ కిరణ్ అబ్బవరమే రాసారు. ఆ తర్వాత వినరో భాగ్యము విష్ణుకథకు కూడా తన వంతు సాయం చేశారు. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ఆ మెగాఫోన్ కూడా పట్టేస్తున్నారు. కిరణ్ మాత్రమే కాదు.. కుర్ర హీరోలలో చాలా మంది దర్శకులుగా మారుతున్నారు. ఇప్పటికే విశ్వక్ సేన్ రెండు సినిమాలు డైరెక్ట్ చేసారు. ఫలక్‌నుమా దాస్, ధమ్కీ సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ హీరో. ప్రస్తుతం కల్ట్ అనే యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇక రామ్ కూడా ఇంటెన్స్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా మారిపోయారు. వీర అనే డిఫరెంట్ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు రామ్. ‘ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఉత్కంఠ రేపుతుంది. డిసెంబర్‌లో సినిమా విడుదల చేయనున్నారు. అలాగే తెలుగబ్బాయి విశాల్ సైతం దర్శకుడిగా మారి మకుటం సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొత్తానికిప్పుడు హీరోలే దర్శకులుగా మారే ట్రెండ్ నడుస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడిసముద్రంలో టైం బాంబ్..భారత నేవీ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్!
ఈ శుక్రవారం OTTల్లో సైన్మా జాతర.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్‌కు..
Vadde Naveen: బన్నీ ఎదుగుదల.. నన్ను ఆశ్చర్యపరిచింది
Raghava Lawrence: ‘రాజకీయాల్లోకి రావాలా వద్దా?’ ఫ్యాన్స్‌కి లారెన్స్ సూటి ప్రశ్న
Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్ మొత్తం పాయె!
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్ టీ.. కారణం ఇదే
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!

