AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?

Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?

Phani CH
|

Updated on: Jun 13, 2026 | 1:45 PM

Share

94 ఏళ్ల వయసులోనూ తన సృజనాత్మకతతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ ఒక వినూత్న సంగీత కథ. మాటలకంటే పాటలతోనే కథను ముందుకు నడిపిస్తూ మానవత్వం, ప్రకృతి పరిరక్షణ, సహజీవనం వంటి సందేశాలను అందంగా ఆవిష్కరించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, భావోద్వేగభరిత కథనం ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి.

ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చేసిన దర్శకులలో ముందుండే పేరు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు అలా చరిత్రలో నిలిచిపోయాయి. 94 ఏళ్ల వయస్సులో ఆయన నుంచి వచ్చిన అందమైన చందమామ కథ లాంటి సినిమా ‘సింగ్ గీతం’. నాగ్ అశ్విన్ విజన్ ఈ సినిమాకు తోడైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. సింగీతం సినిమా కథ విషయానికి వస్తే.. బీహార్ జైలు నుంచి తన సొంతూరు కుబేరపురానికి తండ్రి ఆస్తి కోసం వస్తాడు ప్రతాప్ మన్నెం అలియాస్ అయాన్. ఆయన తండ్రి ఉదయ్ మన్నెం అలియాస్ రాహుల్ రవీంద్రన్‌కు ఆ ఊళ్లో బంగారు గనులు ఉంటాయి. దాంతో ఎలాగైనా అక్కడున్న గనులు అమ్మేసి సొమ్ము చేసుకోవాలని ఊరికి వస్తాడు ప్రతాప్. కానీ అప్పటికే ఆ బంగారు గనిని అమ్మి సంపాదించుకోవాలని బ్రహ్మయ్య అలియాస్ బెనర్జీ, ఆయన కూతురు రేణు అలియాస్ షాలిని కొండెపూడి ఉంటారు. అక్కడ ఊరి జనంతో గనుల్లోకి తీసుకెళ్లి పనులు చేయిస్తుంటారు. మరోవైపు ఆ ఊరి మొత్తానికి ఉండే ఒకే ఒక్క చెట్టు.. చివరి చెట్టులో వాళ్ల అమ్మను చూసుకుని అందులోనే ఉంటుంది గౌరీ అలియాస్ అహిల్యా బమ్రూ. చెట్టును కొట్టేసి గనులు తవ్వడానికి ఆమె ససేమిరా అంటుంది. కానీ ఆమెను పక్కనకు నెట్టేసి ఆ చెట్టు కొట్టేస్తారు. దాంతో ఆమె కుబేరుడి గుహలోకి వెళ్లి దేవుడినే నిలదీస్తుంది. అక్కడ్నుంచి ఆ ఊరికి శాపం తగులుతుంది.. మాటలు కాస్తా పాటలు అవుతాయి.. ఏదైనా పాట రూపంలోనే బయటికి వస్తుంది.. అలాగే నిజాలు బయటికి వస్తాయి.. అవన్నీ ఎలా ఆగుతాయి..? మళ్లీ మామూలు మనుషులు ఎలా అయ్యారు అనేది కథ.. కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చెప్పకూడదు జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే. సింగ్ గీతం కూడా అలాంటి సినిమానే. 94 ఏళ్ల యువకుడు తీసిన సినిమా ఇది. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని సింగ్ గీతం చూస్తే అర్థమైపోతుంది. ముందు ఆ ఆలోచనకే శతకోటి నమస్కారాలు.. సినిమా ఎలా ఉందో చెప్పడానికి మాటల్లేవు.. అన్నీ పాటలే..! ఏం చెప్పినా పాటలోనే.. ఈ ఆలోచనే చాలా క్రేజీగా ఉందసలు..! లైన్ చూసి ప్రయోగం అనుకుంటే పొరపాటే.. ఇలాంటి స్టోరీ టెల్లింగ్‌లో సింగీతం గారు మాస్టర్. అయినా మూడున్నర దశాబ్దాల కింద మాటలే లేకుండా సినిమా తీసిన ఈయనకు.. పాటలతోనే సినిమా తీయడం ఓ లెక్కేం కాదు కదా..! ఓ అందమైన చందమామ కథలా సింగ్ గీతాన్ని తెరకెక్కించారు సింగీతం. ఫస్ట్ పావుగంట మాత్రమే మాటలు.. ఆ తర్వాత అంతా పాటలే. ఒక్కసారి మెయిన్ స్టోరీ మొదలయ్యాక ఎక్కడా ఆగకుండా వెళ్లిపోయింది సినిమా. చెట్టు నాటాలి.. మంచి పెరగాలి.. మనిషిని మనిషిలా చూడాలి.. ఇలా చాలా రొటీన్ విషయాలే ఇందులో చెప్పారు సింగీతం.. కానీ ఆయన చెప్పిన విధానం మాత్రం స్టాండింగ్ అప్లాజ్ ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా సెకండాఫ్ చాలా బాగా కుదిరింది.. క్లైమాక్స్‌లో వచ్చే గోల్డ్ మైన్ సీన్స్ అయితే నెక్ట్స్ లెవల్. స్క్రీన్ మీద స్టార్స్ ఎవరూ లేకపోయినా.. స్క్రీన్ ప్లేతో గూస్ బంప్స్ తెప్పించారు సింగీతం. ఆయన టేకింగ్, ఆలోచన.. అన్నీ చాలా కొత్తగా అనిపించాయి.. గోల్డ్ మైన్స్ చుట్టూ చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడూ రాలేదు. క్లైమాక్స్‌లో మనిషి మనిషికి సాయం చేయాలనే సీన్ సింగీతం గారు తెరకెక్కించిన తీరుకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చినా తప్పులేదేమో..? అంత బాగా రాసారాయన. కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయేమో కానీ బోర్ అయితే కొట్లవు. మంచి సినిమా చూసిన ఫీలింగ్‌తోనే బయటికి వస్తాం. నటీనటులు అందరూ చాలా బాగా నటింస్తూ.. తమ గొంతుతోనే ఎవరి పాటలు వారు పాడుకున్నారు. ముఖ్యంగా కొత్త కుర్రాడు అయాన్ బాగున్నాడు.. అలాగే అహిల్యా బమ్రూ నటన చాలా ముద్దుగా అనిపిస్తుంది. తెలుగమ్మాయి షాలిని విలనిజం బాగుంది. వంశీధర్ రెడ్డి నవ్వించాడు. మిగిలిన వాళ్లంతా చాలా బాగున్నారు. చివర్లో స్టార్ హీరో క్యామియో ఒకటుంటుంది. అదే ఈ సినిమాలో సర్‌ప్రైజ్‌. ఆ స్టార్‌ కూడా చివర్లో వచ్చి అదరగొట్టేస్తాడు. దేవీ శ్రీ ప్రసాద్ రేంజ్ ఏంటో ఈ సినిమాతో మరోసారి అర్థమవుతుంది.. ఆయన పాటే సినిమాకు ప్రాణం.. ప్రతీ పాట అద్భుతంగా, వినసొంపుగా ఉంది. ఎడిటింగ్ షార్ప్‌గానే ఉంది. అంకూర్ సంజీవ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సింగ్ గీతం కోసం సింగీతం ఆలోచనలకు తెరరూపం ఇచ్చిన నాగ్ అశ్విన్ కష్టాన్ని కూడా తక్కువ చేయకూడదు.. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం గురించి ఏం చెప్తాం.. ఆయన ఓ అద్భుతం అంతే..! ఓవరాల్‌గా సింగ్ గీతం.. సింగీతం మనసులోంచి పుట్టిన చందమామ కథ..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభుత్వ కీలక నిర్ణయం..ఇకపై అన్ని శనివారాలు సెలవు

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మెనూలోకి రానున్న పప్పు

మామిడి టెంకలను పడేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలు పడేయరు

Vitamin D: ‘సన్‌షైన్’ విటమిన్… ఇది లోపిస్తే చాలా కష్టం!

Top 9 ET News: ప్రభాస్‌తో ధురంధర్ దర్శకుడు సినిమా.. ఇదిగో క్లారిటీ..

Follow Us