AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ కీలక నిర్ణయం..ఇకపై అన్ని శనివారాలు సెలవు

ప్రభుత్వ కీలక నిర్ణయం..ఇకపై అన్ని శనివారాలు సెలవు

Phani CH
|

Updated on: Jun 12, 2026 | 6:33 PM

Share

ప్రభుత్వ ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపరిచేందుకు త్రిపుర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని శనివారాలు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినాలుగా ప్రకటించింది. దీంతో వారానికి ఐదు రోజులే కార్యాలయాలు పనిచేయనున్నాయి. అయితే ప్రజా సేవలకు ఆటంకం కలగకుండా పని గంటలను పెంచింది. ఉద్యోగుల సంక్షేమం, ఉత్పాదకత పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించి, వారి ‘వర్క్ లైఫ్‌ బ్యాలెన్స్’ పెంపొందించే దిశగా త్రిపుర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై నెలలోని అన్ని శనివారాలను అధికారికంగా సెలవు దినాలుగా ప్రకటిస్తూ అక్కడి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు త్రిపురలో సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే నెలలో కేవలం రెండవ, నాల్గవ శనివారాలు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండేది. కానీ తాజా నిర్ణయంతో, ఇకపై నెలలో వచ్చే అన్ని ఆదివారాలతో పాటు అన్ని శనివారాలు కూడా ఉద్యోగులకు పూర్తి సెలవు దినాలుగా మారనున్నాయి. అంటే వారానికి ఐదు రోజులు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి. వారంలో ఒక రోజు పనిదినం తగ్గుతున్న నేపథ్యంలో, ప్రజా సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు వీలుగా త్రిపుర సర్కార్ ఆఫీసు పని సమయాల్లో కీలక మార్పులు చేసింది. అయితే రోజువారీ పని గంటలను ప్రభుత్వం పెంచింది. ఇదివరకు ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉన్న పని సమయాన్ని.. ఇకపై ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు పొడిగించారు. త్రిపుర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అక్కడి ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే తరహా ఐదు రోజుల పని వారాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అమలు చేస్తే ఉద్యోగుల ఉత్పాదకత మరింత పెరుగుతుందని ఇతర రాష్ట్రాల ఉద్యోగులు కూడా అభిప్రాయపడుతున్నారు. కొత్త విధానం ఉద్యోగులకు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశాన్ని ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యక్తిగత అభివృద్ధి, విశ్రాంతి, మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వారాంతంలో వరుసగా రెండు రోజులు విశ్రాంతి తీసుకునే అవకాశం పొందడం వల్ల ఉద్యోగ సంతృప్తి పెరగడంతో పాటు కార్యాలయాల్లో ఉత్పాదకత కూడా మెరుగుపడే అవకాశముందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా ప్రభుత్వం చేపడుతున్న పరిపాలనా సంస్కరణల్లో ఇది మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వస్తున్న సానుకూల స్పందనను దృష్టిలో ఉంచుకుంటే, ఈ కొత్త పని విధానం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మెనూలోకి రానున్న పప్పు

మామిడి టెంకలను పడేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలు పడేయరు

Vitamin D: ‘సన్‌షైన్’ విటమిన్… ఇది లోపిస్తే చాలా కష్టం!

Top 9 ET News: ప్రభాస్‌తో ధురంధర్ దర్శకుడు సినిమా.. ఇదిగో క్లారిటీ..

Peddi: నయా కలెక్షన్స్‌ కింగ్! బాక్సాఫీస్‌కు అసలైన ఛాంపియన్ ‘పెద్ది’

Follow Us