AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: నయా కలెక్షన్స్‌ కింగ్! బాక్సాఫీస్‌కు అసలైన ఛాంపియన్ ‘పెద్ది’

Peddi: నయా కలెక్షన్స్‌ కింగ్! బాక్సాఫీస్‌కు అసలైన ఛాంపియన్ ‘పెద్ది’

Phani CH
|

Updated on: Jun 12, 2026 | 5:52 PM

Share

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఓవర్సీస్‌లోనూ రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా, సమీపంలో పెద్ద విడుదలలు లేకపోవడంతో మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఛాంపియన్‌గా నిలిచింది. జూన్ 04న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా మొదటి రోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా రికార్డు లెవల్ కలెక్షన్లు రాబడుతోంది. పెద్ది మూవీ సక్సెస్ ఫుల్‌గా మొదటి వారం రన్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు రామ్ చరణ్ సినిమా ఏడు రోజుల కలెక్షన్ల వివరాలను చిత్ర బృందం ప్రకటించింది.ఇప్పటివరకు పెద్ది, ప్రపంచవ్యాపం రూ.345 కోటకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ రోజుతో 350 కోట్లు దాటే అవకాశముందని చెబుతున్నారు. అంతేకాదు ‘బాక్సాఫీస్ రియల్ ఛాంపియన్ ‘పెద్ది’ అంటూ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ కొత్త పోస్టర్ కూడా వదిలారు. ఇక ఓవర్సీస్ లోనూ పెద్ది సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటికే 3 మిలియన్ల డాలర్క్ మార్క్ ను పెద్ది అధిగమించింది.ఈ వారంలోనూ థియేటర్లలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. కాబట్టి మరికొన్ని రోజులు పెద్ది జోరు కొనసాగవచ్చునని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్ లో మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: బన్నీ.. నీ ‘రాకా’ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా.. – చరణ్

Allu Arjun: ఇంటికెళ్లి మరీ పవన్‌ను పరామర్శించిన బన్నీ

మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?

కోడిగుడ్డు తింటే.. కొలెస్ట్రాల్ పెరగదు !

5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది

Follow Us