AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడిగుడ్డు తింటే.. కొలెస్ట్రాల్ పెరగదు !

కోడిగుడ్డు తింటే.. కొలెస్ట్రాల్ పెరగదు !

Phani CH
|

Updated on: Jun 12, 2026 | 4:45 PM

Share

ప్రతి ఏటా జూన్ 3న జరుపుకునే నేషనల్ ఎగ్ డే సందర్భంగా గుడ్డు ఆరోగ్య ప్రయోజనాలపై చర్చ సాగుతోంది. ఒక గుడ్డులో అధిక నాణ్యత గల ప్రోటీన్, కోలిన్, ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గుడ్లు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచవని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యవంతులు రోజుకు 1-2 గుడ్లు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి ఏటా జూన్ 3న జరుపుకునే ‘నేషనల్ ఎగ్ డే’ సందర్భంగా గుడ్డు ప్రాముఖ్యత, దాని పోషక విలువలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. గతంలో గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే ఆందోళనలు ఉండేవి. అయితే, ఆరోగ్యవంతులు నిశ్చింతగా గుడ్లను తమ ఆహారంలో చేర్చుకోవచ్చని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వంటి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు స్పష్టం చేశాయి. ఒక పెద్ద ఉడకబెట్టిన గుడ్డులో కేవలం 75 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో కండరాల పుష్టికి తోడ్పడే అధిక నాణ్యత గల ప్రోటీన్‌తో పాటు శరీరానికి అవసరమైన 9 రకాల అమైనో ఆమ్లాలు లభిస్తాయి. మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే ‘కోలిన్’, కంటి ఆరోగ్యాన్ని కాపాడే ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు గుడ్డులో పుష్కలంగా ఉన్నాయి. గుడ్డు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగదని, పైగా మంచి కొలెస్ట్రాల్‌ మెరుగవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతులు రోజుకు 1 నుండి 2 గుడ్లు హాయిగా తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆయిల్ ఎక్కువగా వేసి వేయించిన వాటి కంటే, ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల పోషకాలు సంపూర్ణంగా అందుతాయి. మధుమేహం, తీవ్రమైన గుండె జబ్బులు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది

ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?

ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్‌ మొత్తం పాయె!

Green Tea: ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్‌ టీ.. కారణం ఇదే

Follow Us