AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్‌ మొత్తం పాయె!

ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్‌ మొత్తం పాయె!

Phani CH
|

Updated on: Jun 12, 2026 | 4:35 PM

Share

భీకరమైన మాంసాహారి డైనోసార్ టీ-రెక్స్‌కు ఎందుకు చిన్న చేతులు ఉన్నాయన్న ప్రశ్నకు శాస్త్రవేత్తలు కొత్త వివరణ ఇచ్చారు. యూనివర్సిటీ కాలేజీ లండన్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, టీ-రెక్స్ వేటలో చేతుల కంటే బలమైన దవడలు, భారీ తలను ఎక్కువగా ఉపయోగించేది. దీంతో పరిణామ క్రమంలో చేతుల ప్రాధాన్యం తగ్గి అవి చిన్నవిగా మారాయని పరిశోధనలో తేలింది.

టైరానసారస్‌ రెక్స్‌ అలియాస్‌ టీ రెక్స్‌. సింపుల్‌గా చెప్పాలంటే.. రాకాసి బల్లుల రాజ్యానికి రారాజు టైపు. డైనోసార్లలో సూపర్‌స్టార్‌ అన్నమాట. జురాసిక్‌ పార్కు సినిమాలన్నిటిలో ఇదే హీరో. 45 అడుగుల పొడవు.. భీకరాకారం..భయపెట్టే కళ్లు.. కరకరా నమిలేసే పళ్లు.. అయితే, అన్నీ ఎలివేషన్లే అయితే.. దీనికి బాగా పొగరు పెరిగిపోదూ.. ఈ డౌట్‌తోనేమో దీన్ని సృష్టించే సమయంలో దేవుడు దీనికి ‘హ్యాండ్‌’ ఇచ్చాడు. 45 అడుగుల టీ రెక్స్‌కు కేవలం మూడడుగుల పొడవుండే చేతులు మాత్రమే ఇచ్చాడు. అంటే.. ఆరడుగుల మనిషికి ఐదు అంగుళాల చేతులు ఉన్నట్లన్నమాట. నిజంగా దేవుడు అలా చేశాడా లేదా అన్నది పక్కనపెడితే.. అత్యంత భయంకరమైన మాంసాహారిగా పేరొందిన టీ రెక్స్‌ చేతులు ఎందుకు అంత చిన్నగా ఉన్నాయి అన్న అంశంపై ఏళ్లుగా శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. వాళ్ల బుర్రలకు భరోసా కల్పిస్తూ యూనివర్సిటీ కాలేజీ లండన్‌ పరిశోధకులు తామీ రహస్యాన్ని ఛేదించామని తాజాగా ప్రకటించారు. ఇప్పటివరకూ దాని భారీ శరీర పరిణామం వల్లే చేతులు చిన్నవిగా ఉన్నాయని భావించారు. అయితే.. వేటలో చేతుల ప్రాధాన్యం తగ్గిపోవడంతో.. పరిణామ క్రమంలో అవి చిన్నవి అయ్యాయని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు తేల్చారు. టీ రెక్స్‌తోపాటు ఈ జాతిలోని మరికొన్నిటి చేతులు చిన్నవిగా ఉన్నాయని గుర్తించారు. చేతులు చిన్నగా ఉండటానికి కారణం.. వాటి బలమైన తల, దవడలే అనీ తేల్చారు. పెద్ద జంతువులను వేటాడేటప్పుడు ఇది గోళ్లతో కంటే.. దవడలతోనే బలంగా దాడి చేసేది. దీంతో వాటి చేతుల సైజూ తగ్గిపోవడం మొదలైందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సైంటిస్ట్‌ చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Green Tea: ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్‌ టీ.. కారణం ఇదే

Follow Us