AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది

ప్రముఖ దర్శకుడు వి. సముద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సినిమాల గురించి అలాగే తన దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఓ బ్లాక్ బస్టర్ సినిమా గురించి అనేక రహస్యాలు పంచుకున్నారు.

ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది
Movie
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2026 | 11:21 AM

Share

ప్రముఖ దర్శకుడు వి. సముద్ర ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిరంజీవి వృత్తి నిబద్ధత నుండి బ్లాక్ బస్టర్ చిత్రం నరసింహనాయుడు నిర్మాణ రహస్యాల వరకు అనేక అంశాలను పంచుకున్నారు. బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం నరసింహనాయుడు గురించి మాట్లాడుతూ, తాను ఆ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశానని సముద్ర తెలిపారు. దర్శకుడు బి. గోపాల్ ని తన గురువుగా చెప్పుకోవడానికి గర్వపడతానని, ఆయన చాలా మంచి వ్యక్తి, కూల్ గా ఉంటారని, కోపం వస్తే “ఏంటమ్మా?” అనేవారని పేర్కొన్నారు. సమరసింహారెడ్డి, లారీ డ్రైవర్, నరసింహనాయుడు, ఇంద్ర, స్టేట్ రౌడీ వంటి అనేక హిట్ చిత్రాలను బి. గోపాల్ గారు తెరకెక్కించారని ప్రస్తావించారు.

ఇది కూడా చదవండి : Jabardasth Vinod: జబర్దస్త్ లేకపోతే ఆ పని చేసేవాడిని.. అసలు విషయం చెప్పిన లేడీ గెటప్ వినోద్

నరసింహనాయుడు చిత్రం డబుల్ యూనిట్ వర్క్ అని, తాను విక్రమ్ ధర్మ మాస్టర్ తో కలిసి సుమో ఛేజింగ్ సన్నివేశాలను పర్యవేక్షించానని సముద్ర గారు వివరించారు. ఆ రోజుల్లో ట్రైన్ ను సుమోలు ఛేజ్ చేయడం, హెలికాప్టర్ షాట్లు వంటివి చాలా పెద్ద విషయాలని, అరకు రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ లపై సుమోలు దూసుకురావడం అప్పట్లో ఒక వినూత్నమైన ఘట్టమని చెప్పారు. సినిమాలోని బాలయ్య బాబు ఎంట్రీ, కత్తులు కిందపడేసి వెనక్కి వెళ్ళే సన్నివేశాలు, కుటుంబ సభ్యులను కాపాడే ఎపిసోడ్ అన్నీ అద్భుతమని, సినిమా విడుదల కాకముందే ఇది పెద్ద హిట్ అవుతుందని తమకు తెలిసిపోయిందని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి : ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్

అయితే, సినిమా విజయానికి ఒక కీలకమైన మార్పు ఇంటర్వెల్ విషయంలో జరిగిందని సముద్ర గారు వెల్లడించారు. మొదట, రైల్వే స్టేషన్ లో హీరో కత్తి పట్టుకుని నడిచే బిల్డప్ సీన్ ను ఇంటర్వెల్ గా ప్లాన్ చేశారని, కానీ పరుచూరి గోపాలకృష్ణ గారు చివరి నిమిషంలో జోక్యం చేసుకుని ఇంటర్వెల్ ను మార్చాలని సూచించారని తెలిపారు. ఇంటర్వెల్ ను సెంటిమెంటల్ సీన్ కు మార్చగా, బి. గోపాల్ గారు మొదట అప్సెట్ అయ్యారని, అంత పెద్ద బిల్డప్ వదిలేసి ఇంటర్వెల్ మార్చడం ఎలాగని ప్రశ్నించారని అన్నారు. కానీ, రైటర్లని బాగా నమ్మే బి. గోపాల్ గారు పరుచూరి గోపాలకృష్ణ గారి నిర్ణయాన్ని అంగీకరించారని, పరుచూరి గోపాలకృష్ణ గారు “గోపాల్, మమ్మల్ని నమ్ముతావు కదా? ఈ విషయం నన్ను నమ్ము” అని చెప్పారని సముద్ర గారు గుర్తు చేసుకున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ, పరుచూరి గోపాలకృష్ణ గారు సెకండాఫ్ లో అద్భుతమైన కథ ఉందని, ఇంటర్వెల్ కోసం బిల్డప్ సన్నివేశాన్ని తీస్తే సెకండాఫ్ మాత్రమే బాగుందని ప్రేక్షకులు అంటారని, ఫస్టాఫ్ కూడా సూపర్ గా ఉండాలని, అందుకోసం సెకండాఫ్ లోని కొన్ని కథాంశాలను ఫస్టాఫ్ లోకి తీసుకొచ్చారని సముద్ర గారు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఫస్టాఫ్ చూసిన ప్రేక్షకులు “అబ్బా, ఏముంది సినిమా!” అని ప్రశంసించారని, సెకండాఫ్ చూసిన తర్వాత రికార్డులు బద్దలయ్యాయని సముద్ర చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు నా సినిమాలో నటించాడు.. ఇప్పుడు స్టార్ హీరో.. అతను ఎంత మారిపోయాడంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర