AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు నా సినిమాలో నటించాడు.. ఇప్పుడు స్టార్ హీరో.. అతను ఎంత మారిపోయాడంటే

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో వడ్డే నవీన్ ఒకరు. పెళ్లి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యారు. చాలా ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రముఖ నటుడు వడ్డే నవీన్ తిరిగి వెండితెరపై, బుల్లితెరపై కనిపించారు.

అప్పుడు నా సినిమాలో నటించాడు.. ఇప్పుడు స్టార్ హీరో.. అతను ఎంత మారిపోయాడంటే
Vadde Naveen
Rajeev Rayala
|

Updated on: Jun 13, 2026 | 3:55 PM

Share

సీనియర్ నటుడు వడ్డే నవీన్ ఇప్పుడు తిరిగి సినిమాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు క్రేజీ హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం వడ్డే నవీన్ నటించిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  తన కెరీర్‌లో అత్యంత ఇష్టమైన చిత్రాలను ప్రస్తావిస్తూ, స్నేహితులు, మనసిచ్చి చూడు, నా ఊపిరి వంటి చిత్రాలు తనకు ప్రత్యేకమని తెలిపారు. ముఖ్యంగా నా ఊపిరి సినిమా ఒక విభిన్నమైన జోనర్‌ చిత్రంగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందని ఆయన పేర్కొన్నారు.

అలాగే హీరో రవితేజ అద్భుతమైన ఎదుగుదలపై వడ్డే నవీన్ ప్రశంసల వర్షం కురిపించారు. మనసిచ్చి చూడు చిత్రంలో రవితేజతో కలిసి నటించిన రోజులని గుర్తుచేసుకుంటూ, ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరు తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని అన్నారు. ” రవితేజ కష్టానికి తగిని గుర్తింపు లభించింది.. అందుకే స్టార్ హీరో అయ్యాడు.. అంత పైకి రావటం అనేది చిన్న విషయం కాదు. ఆయన ఎదుగుదల పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని నవీన్ వ్యాఖ్యానించారు. రవితేజను కలిసినప్పుడల్లా ఆయన ఎంతో ఆత్మీయంగా, స్నేహపూర్వకంగా ఉంటారని, అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పూ లేకుండా అలాగే ఉంటారని వడ్డే నవీన్ అన్నారు. అదేవిధంగా పరిశ్రమలో అందరితో సానుకూల సంబంధాలను కొనసాగించడమనేది గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో, ఎవరి పని వారు చేసుకుంటున్నారు కాబట్టి, పరిశ్రమలో ప్రతి ఒక్కరూ సానుకూలంగానే వ్యవహరిస్తారని తెలిపారు.

సినిమాలలో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణపై ఇటీవల వస్తున్న విమర్శలపైనా వడ్డే నవీన్ తన అభిప్రాయం పంచుకున్నారు. క్రియేటివిటీకి నిర్దిష్టమైన నియమాలు ఉండవని, కొన్నిసార్లు హీరోయిన్ల పాత్రలను సరిగ్గా చిత్రిస్తున్నారని, మరికొన్నిసార్లు సరిగ్గా చూపించట్లేదని అన్నారు. తన దృష్టిలో, సినిమాల్లో ఏ పాత్ర అయినా, అది చిన్నదైనా పెద్దదైనా, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని, వారి పాత్ర పరిధిని స్పష్టంగా చూపాలని, వారి నటనకు ప్రాధాన్యత ఇవ్వాలని నవీన్ తెలిపారు.

Raviteja

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర