Jabardasth Vinod: జబర్దస్త్ లేకపోతే ఆ పని చేసేవాడిని.. అసలు విషయం చెప్పిన లేడీ గెటప్ వినోద్
జబర్దస్త్ వినోద్ తన కెరీర్ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలోని విషయంలోను పంచుకున్నారు. తన తల్లిదండ్రులు, భార్య విజయలక్ష్మి (విజ్జు) ఇచ్చిన అండతోనే కష్టాలను అధిగమించానని, కుటుంబమే తనకు అన్నింటికంటే ముఖ్యమని వినోద్ స్పష్టం చేశారు. అలాగే జబర్దస్త్ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో వినోద్ ఒకరు. ఇలా చెప్తే చాలా మంది గుర్తుపట్టక పోవచ్చు కానీ లేడీ గెటప్ వినోదిని అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. లేడీ గెటప్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు వినోద్. జబర్దస్త్ వినోద్, తన జీవిత ప్రయాణం, కెరీర్ ఎదుగుదల, వ్యక్తిగత జీవితంలోని నిజాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో ఎదురైన సవాళ్లను, వాటిని అధిగమించడానికి తనకు తోడుగా నిలిచిన కీలక వ్యక్తుల గురించితెలిపాడు వినోద్. ఆయన మాట్లాడుతూ.. యాంకరింగ్ పట్ల తనకు ఎంతో అభిరుచి ఉందని తెలిపాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కూడా యాంకర్ అవ్వాలనే లక్ష్యంతోనేనని ఆయన చెప్పాడు. ప్రస్తుతం పలు పబ్లిక్, ప్రైవేట్, కార్పొరేట్ షోలకు విజయవంతంగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ, సినిమాల్లోనూ నటిస్తున్నానని వినోద్ అన్నారు. జబర్దస్త్ తన జీవితానికి ఒక మలుపు అని, దాని ద్వారానే ప్రజలకు మరింత దగ్గర కాగలిగానని ఆయన స్పష్టం చేశాడు. జబర్దస్త్ లేకపోతే బ్యాంక్ ఉద్యోగిగానో లేదా సాఫ్ట్‌వేర్ రంగంలోనో స్థిరపడి ఉండేవాడినని, ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి పశువైద్యుడిని అయ్యే అవకాశం కూడా ఉండేదని ఆయన అన్నారు. అయితే, తన మాట్లాడే స్వభావమే తనను ఇండస్ట్రీ వైపు నడిపించాయని ఆయన పేర్కొన్నారు.
కడపలో జన్మించిన వినోద్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి. తల్లిదండ్రులు తనను ఎంతో ప్రేమగా పెంచారని, కోరినవన్నీ అడగకముందే సమకూర్చారని ఆయన గుర్తు చేసుకున్నాడు. తన తల్లిదండ్రులు ఎంతో స్ట్రిక్ట్‌గా ఉన్నప్పటికీ, తాను చదువును, కెరీర్‌ను సమాంతరంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంబీఏ పూర్తి చేశానని తెలిపాడు. తన తల్లి తనకు మంచి స్నేహితురాలని, తన వ్యక్తిగత విషయాలను కూడా ఆమెతో పంచుకుంటానని వినోద్ తెలిపాడు. హీరోగా ఎదగాలనే కలలు లేవని, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడాలని, తన కోసం డైరెక్టర్లు పాత్రలు సృష్టించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని వినోద్ తెలిపాడు. షార్ట్‌కట్‌లను తాను నమ్మనని, విధిలో రాసి ఉంటే అది తప్పకుండా జరుగుతుందని చెప్పుకొచ్చాడు.
అలాగే ఆయన మాట్లాడుతూ.. నలుగురు వ్యక్తులు తన జీవితానికి ఆధారం అయ్యారని పేర్కొన్నాడు. వినోద్ తన తల్లిదండ్రులతో పాటు తన భార్య విజయలక్ష్మి (విజ్జు) అందించిన నిరంతర మద్దతు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. లేడీ గెటప్ కారణంగా సమాజం నుండి ఎదురైన విమర్శల సమయంలో తన భార్యనే తనను ఎంతగానో ప్రోత్సహించిందని, ఆ చెడు విషయాలను ఎదుర్కోవడానికి ఆమె ఎంతో ధైర్యం ఇచ్చిందని వినోదిని తెలిపాడు. తన తల్లి తర్వాత, తన తండ్రి, ఆ తర్వాత తన భార్య తన జీవితంలో అత్యంత బలమైన మద్దతుదారులని ఆయన చెప్పాడు. తనకు నీరజ అనే కూతురు, లక్షిత్ అనే కొడుకు ఉన్నారని, అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్ తనదినని వినోద్ వెల్లడించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
