AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Jeevan: బతకడని డాక్టర్లు చేతులెత్తేశారు.. జబర్దస్త్ జీవన్‌కు కొత్త జీవితం ప్రసాదించిందెవరో తెలుసా?

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో జీవన్ కూడా ఒకడు. సాధారణ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అతను జిగేల్ జీవన్ గా టీమ్ లీడర్ దాకా ఎదిగాడు.అయితే ప్రస్తుతం అతను ఈ జబర్దస్త్ లో చేయడం లేదు. సినిమాలు, ఈవెంట్లతో బిజీగా ఉంటున్నాడు.

Jabardasth Jeevan: బతకడని డాక్టర్లు చేతులెత్తేశారు.. జబర్దస్త్ జీవన్‌కు కొత్త జీవితం ప్రసాదించిందెవరో తెలుసా?
Jabardasth Jeevan
Basha Shek
|

Updated on: Jul 27, 2026 | 8:17 PM

Share

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా నగర్ బ్యాచ్ లో జీవన్ కూడా ఒకడు. ఈ షోలో చాలా ఏళ్ల పాటు కమెడియన్ గా చేశాడు జీవన్. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. నిజం చెప్పాలంటే జీవన్ మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. కేవలం కామెడీ మాత్రమే కాకుండా డప్పు కూడా అద్భుతంగా కొడుతుంటాడీ నటుడు. అంతేకాదు ఇతను స్వతహాగా సింగర్. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను. కృష్ణవంశీ ‘మహాత్మ’ సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి పాట పాడింది తామేనని అయితే ఎక్కడా మాకు గుర్తింపు ఇవ్వలేదని ఓ ఇంటర్వ్యూలో వాపోయాడు జీవన్. ఇక జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీల్లో పలు సాంగ్స్ కు కొరియోగ్రఫీ కూడా చేశాడు జీవన్. అయితే ఇప్పుడీ కమెడియన్ జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. చాలా ఏళ్ల క్రితమే ఈ షోను విడిచి పెట్టాడు. ప్రస్తుతం సినిమాలు, ఈవెంట్లతో బిజీగా ఉంటున్నాడు. అయితే జబర్దస్త్ లో ఉండగానే తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు జీవన్. 2021లో చాలా రోజుల పాటు జబర్దస్త్ తో పాటు ఏ టీవీ షోలోనూ కనిపించలేదీ ట్యాలెంటెడ్ యాక్టర్. అ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన జీవన్.. చాలా రోజుల పాటు ఐసీయూలోనే ఉండి చావు వరకూ వెళ్లి వచ్చాడు.

ఒకానొక సందర్భంలో జీవన్ ఆరోగ్యం క్షీణించిందని, అతను చనిపోతాడని డాక్టర్లు కూడా చేతులెత్తేశారట. దీంతో జీవన్ కుటుంబ సభ్యులు తెగ ఆందోళన చెందారట అయితే ఆ సమయంలో జబర్దస్త్ టీమ్ లీడర్ అదిరే అభి ప్రత్యేక చొరవ తీసుకుని జబర్దస్త్ కమెడియన్ల అందరి సహకారంతో ఆర్ధికసాయం చేసి జీవన్‌ని కాపాడగలిగారట. ఈ విషయాన్ని జీవనే ఓ సందర్భంలో బయట పెట్టాడు. ‘నేను ఈ రోజు ఇలా బతికి ఉన్నానంటే.. నా జబర్దస్త్ టీం లీడర్స్ వాళ్ల వల్లే. వారు లేకపోయి ఉంటే నేను చనిపోయేవాడిని. ఒక్కసారి కాదు రెండు సార్లు నాకు సీరియస్ అయ్యింది. రెండోసారి అయితే నేను ఇక బతకనని డాక్టర్లు చెప్పేశారు. ఆ సమయంలో నా చిన్న పాపను గుర్తు తెచ్చుకుని కుమిలిపోయాను. ఇంజక్షన్స్ చేస్తున్నా బాడీ సహకరించలేదు. డాక్టర్లు బతకడం కష్టమని చెప్పేస్తే జబర్దస్త్ వాళ్లంతా నన్ను కాపాడారు’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు జీవన్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం జబర్దస్త్ జీవన్ ఎలా ఉన్నాడో చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us