AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘విక్రమార్కుడు’తో సహా ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ గుర్తుందా? ఇప్పుడామె కూతురు కూడా..

వెండితెరపై ఎన్నో వందల సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపైనా పలు సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంది. అయితే ఇప్పుడీ అందాల తార సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. కానీ త్వరలోనే ఆమె కూతురు హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం కానుంది.

Tollywood: 'విక్రమార్కుడు'తో సహా ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ గుర్తుందా? ఇప్పుడామె కూతురు కూడా..
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 26, 2026 | 4:56 PM

Share

మధురిమ.. ఈ పేరు చెబితే గుర్తు పట్టలేరు కానీ.. పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు..ఇంకా గుర్తుకు రాలేదా? అయితే రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమా చూశారా? అందులో రాజీవ్ కనకాల భార్యగా నటించింది ఈమెనే. ఆర్ నారాయణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన దళం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మధురిమ. ఆ తర్వాత విక్రమార్కుడుతో పాటు ‘నరసింహనాయుడు’, ‘ఫ్యామిలీ సర్కస్’, ‘ప్రేమతో రా’ ‘తొలివలపు’, వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాచారు. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా సత్తా చాటింది మధురిమ. పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి ఆడియెన్స్ కు చేరువయ్యింది. అన్నట్లు మధురిమ ఒక్కటే కాదు ఆమె భర్త కూడా ప్రముఖ నటుడే. పేరు నవీన్ ఒలేటి. పేరు చెబితే గుర్తు పట్టలేరు కానీ కింది ఫొటో చూస్తే ఇట్టే అర్థం అవుతుంది ఆయనెవరో. బుల్లితెర , వెండితెరపై ఎన్నో సీరియల్స్.. సినిమాల్లో నటించి మెప్పించారు నవీన్. దాదాపు 100 పైగా తెలుగు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు వేశారాయన. ‘ప్రేమంటే ఇదేరా’, ‘తొలివలపు’, ‘నువ్వే నువ్వే’, ‘ప్రేమించుకుందాం రా’, ‘విక్రమార్కుడు’ తదితర సినిమాలు నవీన్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

ఇవి కూడా చదవండి

కాగా నవీన్, మధురిమలిద్దరికి విక్రమార్కుడు సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో మధురిమ రాజీవ్ కనకాల భార్య పాత్రలో కనిపిస్తే.. నవీన్ ఓ సాధారణ కానిస్టేబులో పాత్రలో ఆకట్టుకున్నారు. కాగా వీరిది ప్రేమ వివాహం. ప్రస్తుతం ఈ దంపతులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ అందమైన జంటకు ముగ్గరు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి. అయితే ఈ దంపతుల పెద్ద కుమార్తె మనవి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది స్టార్ కిడ్. తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుస్తూ త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది మనవి.

Actress Madhurima

Actress Madhurima

నవీన్- మధురిమల కూతురి లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Manu 🪩 (@manavvivoleti)

View this post on Instagram

A post shared by Manu 🪩 (@manavvivoleti)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ