AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడమ్ సార్ మేడమ్ అంతే.. మూవీ కోసం ఏ హీరోయిన్ అయినా ఇంత చేస్తారా ?

బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ భామ నటిస్తున్న తాజా మూవీ 'ఈఠా'. లక్ష్మణ్ ఉతేకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న 2026న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మేడమ్ సార్ మేడమ్ అంతే.. మూవీ కోసం ఏ హీరోయిన్ అయినా ఇంత చేస్తారా ?
Actress Shraddha Kapoor
Korivi Jayakumar
|

Updated on: Nov 27, 2026 | 8:28 PM

Share

బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ఆషికి 2’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ అమ్మడికి ఉన్న సపరేటు ఫ్యాన్ బేస్ మరే హీరోయిన్‌కు లేదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. సినిమాల్లో ఎంత హాట్‌గా కనిపించినప్పటికి బయట మాత్రం చాలా హోమ్లీగా కనిపిస్తోంది. అలానే తెలుగులో కూడా ప్రభాస్ హీరోగా నటించిన సాహో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించికపోవడంతో.. తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

ఇటీవలే శ్రద్ధా నటించిన ‘స్త్రీ-2’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ హిట్‌ను అందుకున్న ఈ మూవీ బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ భామ నటిస్తున్న తాజా మూవీ ‘ఈఠా’. లక్ష్మణ్ ఉతేకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను.. దినేష్ విజన్, లక్ష్మణ్ ఉతేకర్, కరిష్మా శర్మ ప్రొడ్యూస్ చేస్తున్నారు. డిసెంబర్ 4న 2026న రిలీజ్ కానున్న ఈ మూవీలో ప్రముఖ లావణీ కళాకారిణి విఠాబాయి పాత్రలో ఈ స్టార్ హీరోయిన్ కనిపించనుంది.

12 కేజీల బరువు పెరిగిన శ్రద్ధా..

కాగా రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డ్యాన్స్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ ఈ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం శ్రద్ధా చాలా కష్టపడ్డారని వివరించారు. డైరెక్టర్ లక్ష్మణ్ సినిమా షూటింగ్‌ను రివర్స్ ఆర్డర్‌లో చేయాలని డిసైడ్ అయ్యారని.. అందుకు గాను ముందుగా సెకండాఫ్, క్లైమాక్స్ సాంగ్ షూట్ చేశారని తెలిపారు. ఈ పార్ట్ కోసం శ్రద్ధా దాదాపు 10 నుంచి 12 కేజీల బరువు పెరగాల్సి వచ్చిందన్నారు. ఈ కారణం వల్లే వేగంగా కదులుతున్నప్పుడు మోకాళ్లపై ఎక్కువ ప్రెజర్ పడుతుందని.. ఇది ఫిజికల్ ఫిట్‌నెస్‌పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని ఓపెన్ అయ్యారు. అందుకే హీరోయిన్ మూవీ కోసం చాలా కఠినమైన ప్రాక్టీస్, ఫిజికల్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకున్నారని అన్నారు.

Actress Shraddha Kapoor (1)

Actress Shraddha Kapoor

25 రోజుల పాటు..

మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ షూటింగ్ రెండో రోజు లంచ్‌కి కొంచెం ముందు శ్రద్ధాకి తీవ్ర గాయమైందని చెప్పుకొచ్చారు. ఎండకు కాలిపోయిన నేలపై చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయడం వల్ల గాయం తీవ్రత పెరిగిందన్నారు. రెండు నెలల బ్రేక్ తీసుకుని, కఠినమైన ఫిజియోథెరపీ తర్వాత మళ్లీ షూటింగ్‌కి వచ్చారని వెల్లడించారు. శ్రద్ధా రోజూ ఎనిమిది గంటల పాటు రెండు కాళ్లకు 4 కేజీల చొప్పున మొత్తం 8 కేజీల గజ్జెలు కట్టుకుని 25 రోజుల పాటు ప్రాక్టీస్ చేశారని స్పష్టం చేశారు. అయితే సినిమాలో పాత్రకు ప్రాణం పోసేందుకు ఓ హీరోయిన్ ఇంతలా కష్టపడడం గొప్ప విషయమని కామెంట్స్ చేశారు.

Follow Us