AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: అన్నా ఆల్ ది బెస్ట్.. ‘జబర్దస్త్’ నుంచి మరో డైరెక్టర్.. సైలెంట్‌గా సినిమా పూర్తి చేసిన స్టార్ కమెడియన్

జబర్దస్త్ నుంచి ఇప్పటికే చాలా మంది దర్శకులు వచ్చారు. బలగం వేణు, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి, శాంతి కుమార్, రాకింగ్ రాకేష్.. ఇలా ఎంతో మంది డైరెక్టర్లుగా, నిర్మాతలుగా సత్తా చాటుతున్నారు. ఇప్పుడు మరో కమెడియన్ మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ గా మారిపోయాడు.

Jabardasth: అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్.. సైలెంట్‌గా సినిమా పూర్తి చేసిన స్టార్ కమెడియన్
Jabardasth Comedian
Basha Shek
|

Updated on: Jul 24, 2026 | 9:11 PM

Share

ఒకప్పుడు జబర్దస్త్ షోలో కమెడియన్లుగా రాణించిన వారందరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ.. ఇలా ఎంతో మంది జబర్దస్త్ ఆర్టిస్టులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. వీరిలో బలగం వేణు, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి తదితరులు డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో జబర్దస్త్ కమెడియన్ చేరనున్నాడు. జబర్దస్త్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ షోను అంటిపెట్టుకుని ఉన్న కమెడియన్లలో ఇతను కూడా ఒకడు. కేవలం జబర్దస్త్ మాత్రమే కాదు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ ఈ కమెడియన్ సందడి చేస్తుంటాడు. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తోన్న ఈ స్టార్ కమెడియన్ ఇప్పుడు కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతున్నాడు. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా?

జబర్దస్త్ లో ఎక్కువగా స్కిట్స్ చేసింది ఎవరంటే రాకెట్ రాఘవ అనే చెప్పవచ్చు. ఇప్పటిదాకా జబర్దస్త్ కు ఎంతో మంది వచ్చారు. అలాగే ఎంతో మంది బయటకు వెళ్లిపోయారు. కానీ రాకెట్ రాఘవ మాత్రం చాలా ఏళ్లుగా ఈ షోలోనే కంటిన్యూ అవుతున్నాడు. అయితే ఇప్పుడీ కమెడియన్ డైరెక్టర్ గా మారిపోయాడు. అంతేకాదు సైలెంట్ గా ఒక సినిమాను కూడా పూర్తి చేశాడు రాఘవ. సత్యదేవ్ తో కలిసి ‘రావు బ‌హ‌దూర్’ ను తెరకెక్కించిన నిర్మాత‌ల్లో ఒక‌రైన చింతా గోపాల కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయట. తాజాగా ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ‘అలా అలా జరిగిందా?’ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి రోనక్, టీనా శ్రావ్య హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రాకెట్ రాఘవ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. దీంతో సినీ అభిమానులు ఈ జబర్దస్త్ నటుడికి ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

తన మొదటి సినిమా అప్డేట్ఇస్తూ వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ రాకెట్ రాఘవ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..