Folk Song: ఏందిరా అయ్యా ఈ పాట.. రీల్స్, డీజేలను షేక్ చేస్తోన్న క్రేజీ ఫోక్ సాంగ్.. పెళ్లి బరాత్‌లో రచ్చ రంబోలా
ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. ముఖ్యంగా డీజేలలో మారుమోగుతున్న పాటల గురించి చెప్పక్కర్లేదు. వారం వారం సరికొత్త సాంగ్స్ రిలీజ్ అవుతుండగా గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ పాట ఇప్పుడు డీజేలలో మోగిపోతుంది. ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే.

తెలుగు జానపద పాటలకు ఎప్పుడూ ఉండే క్రేజే వేరు. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. డీజేలు, వేడుకలు, రీల్స్‌లో ఫోక్ సాంగ్స్ హోరు ఓ రేంజ్ లో ఉంటుంది. ఈమధ్య కాలంలో ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. ఎక్కడ చూసిన ఆ పాటలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డీజేలలో ఫోక్ సాంగ్స్ వెంటే ఆ వైబ్ వేరేలెవల్ ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంటూ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఫోక్ సాంగ్ ఒకటి గిరుకల్ల బాయి. గత రెండు రోజుల క్రితం విడుదలైన ఈ పాట విడుదలైన కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్, వేలాది లైకులతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం ఈ పాట క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..
పల్లెటూరి వాతావరణం, విశాలమైన పొలాలు, నీటి నిల్వలు, సంప్రదాయ దుస్తులు, ఆటపాటలతో గిరుకల్ల బాయి పాటను ఎంతో రంగురంగులగా తెరకెక్కించారు. ఈ పాటలో మాధురి రాథోడ్, జాక్సన్ రోహిత్ జోడీ తమ ఎనర్జిటిక్ డ్యాన్స్, సహజమైన హావభావాలతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశారు. పెద్ద సంఖ్యలో డ్యాన్సర్లతో కలిసి గ్రామీణ నేపథ్యంలో చేసిన నృత్య సన్నివేశాలు పాటకు మరింత గ్రాండ్‌నెస్ తీసుకువచ్చాయి. ఈ పాట సూపర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం దాని క్యాచీ ట్యూన్, గ్రామీణ సొగసు నిండిన లిరిక్స్. కుమార్ కోట రాసిన సాహిత్యం, వెంకట్ అయిమేర అందించిన సంగీతం పెళ్లిళ్లు, వేడుకల్లో డీజేలలో మోతమోగేలా ఉత్సాహాన్ని నింపుతున్నాయి. బొడ్డు దిలీప్ కుమార్ , మమత రమేష్ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఆటపాటల నడుమ సాగే చిలిపి సరసాలు, గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే సన్నివేశాలు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..
శ్రీకాంత్ దర్శకత్వం, కొరియోగ్రఫీలో రూపొందిన ఈ పాటకు జనతా బబ్లు డీఓపీ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ధర్మ రాథోడ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ పాటలోని హుక్ స్టెప్పులు, పల్లవి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ డీజేలలో ఈ పాట మోగుతుంటే వేడుక వాతావరణం మరింత జోష్‌గా మారుతోంది.
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.
గిరుకల్ల బాయి సాంగ్..
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..
