AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్లే నన్ను ఇలా మార్చేశారు.. 61 ఏళ్ల వయసులోనూ కూల్ హీరోగా కనిపించాలనుకుంటున్నా.. షారుఖ్ ఖాన్..

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఇటీవల తనకంటే చిన్నవయసున్న మహిళా సహనటీమణులతో తనకూ మధ్య పెరుగుతున్న వయసు అంతరం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముంబైలో చిత్రనిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి జరిగిన ఒక ప్రచార కార్యక్రమం సందర్భంగాతాను సాంప్రదాయ ప్రేమకథలను పక్కనపెట్టి, ఒక " కూల్ 61 ఏళ్ల హీరో "గా కూడా సినిమాను విజయవంతం చేయగలనని నిరూపించుకోవాలనుకుంటున్నట్లు వివరించారు.

వాళ్లే నన్ను ఇలా మార్చేశారు.. 61 ఏళ్ల వయసులోనూ కూల్ హీరోగా కనిపించాలనుకుంటున్నా.. షారుఖ్ ఖాన్..
Shah Rukh Khan
Rajitha Chanti
|

Updated on: Nov 29, 2026 | 9:45 AM

Share

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన రాబోయే చిత్రం కింగ్ గురించి, తెరపై తన వయసుకు తగ్గ పాత్రలు పోషించాలనే నిర్ణయం వెనుక ఉన్న ఆసక్తికర కారణాలను తాజాగా పంచుకున్నారు. ముంబైలో దర్శకనిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన షారుఖ్, తనకంటే చాలా చిన్న వయసున్న నటీమణులతో కలిసి నటించిన అనుభవాలు తన ఆలోచనలో మార్పు తెచ్చాయని చెప్పారు. ఇప్పుడు తనకు 61 ఏళ్లు వచ్చాయని, వాటికి తగ్గట్టుగా కూల్ 61-ఇయర్-ఓల్డ్ హీరోగా నిలవాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సరదా అనుభవాన్ని షారుఖ్ గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా, దర్శకుడు, హీరోయిన్ పేరు చెప్పనప్పటికీ, కరణ్ జోహార్‌కు ఆ విషయం తెలుసని నవ్వుతూ అన్నారు. ఓ రొమాంటిక్ సన్నివేశంలో హీరోయిన్‌తో ప్రేమ గురించి డైలాగ్ చెబుతున్నప్పుడు, తనకు మధ్య ఉన్న వయసు అంతరం గుర్తుకు వచ్చిందని తెలిపారు. నిన్ను చూస్తుంటే ప్రపంచాన్ని చూసినట్లుంది.. అలాగే రేపు ఉదయం చేయాల్సిన మ్యాథ్స్ హోంవర్క్ పూర్తి చేశావా బేటీ? అని అడగాలనిపించేంతగా వయసు తేడా కనిపించిందని సరదాగా వ్యాఖ్యానించారు. ఆ అనుభవంతోనే తన అసలు వయసుకు తగ్గ పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

కింగ్ చిత్రంలో తన గ్రే-హెయిర్ లుక్ వెనుక కూడా ఇదే కారణం ఉందని షారుఖ్ వివరించారు. 60 ఏళ్ల వయసులోనూ తన వయసుకు తగ్గట్టుగా ఉంటూనే హీరోగా నిలబడగలనా అనే ఆలోచనతో ఈ సినిమా చేశానని చెప్పారు. తన కుమార్తె సుహానా ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో, ప్రపంచంలోని అమ్మాయిలందరూ తమ నాన్న కూడా ఇలాగే ఉండాలని భావించేలా తన పాత్ర ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్ చిత్రంలో షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్‌లతో పాటు అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ, జైదీప్ అహ్లావత్, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సీ, రాఘవ్ జుయల్, అభయ్ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరీనా కపూర్ ఖాన్ డాడీ కూల్ అనే పాటలో మెరిశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

Follow Us