ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. అకౌంట్లోకి రూ.13 వేలు.. జమ అయ్యేది అప్పుడే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు త్వరలో గుడ్‌న్యూస్ అందనుంది. తల్లికి వందనం కింద రూ.13 వేల ఆర్థిక సాయం వచ్చే నెలలో అందించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడ్డ పెండింగ్ నిధులు.. డిసెంబర్ 10వ తేదీలోపు వేసే అవకాశముంది.

ఏపీలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన తల్లికి వందనం నిధులను డిసెంబర్ నెలలో విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలకు రూ.13 వేల చొప్పున ఆర్థిక సాయం అందనుంది. తల్లికి వందనం పథకంలో మొదటి విడతలో రావాల్సిన పెండింగ్ నిధులను 3.29 లక్షల మంది అర్హులైన తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో 64 లక్షల మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. చాలామందికి నిధులు అందలేదని ఫిర్యాదులు వచ్చాయి. ఆగస్టు 25వ తేదీ లోపు తమ పిల్లలను ఒకటో తరగతిలో లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేర్పించిన తల్లులు ఈ పథకానికి అర్హులు. దీంతో వీరికి కూడా ప్రభుత్వం ఈ విడతలో నగదు జమ చేయనుంది. ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున అకౌంట్లలో జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తల్లికి వందనం డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవడం ఎలా..?
-ఏపీ ప్రభుత్వానికి చెందిన బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ పోర్టల్‌లోకి వెళ్లాలి
-అక్కడ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి
– అనంతరం తల్లికి వందనం పథకాన్ని ఎంచుకోవాలి
-2026-27 సంవత్సరాన్ని ఎంపిక చేసుకోవాలి.
-అనంతరం ఆధార్ నెంబరు, క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఆధార్‌కు లింక్ అయిన ఫోన్‌కు ఓటిపి వస్తుంది
-ఆ ఓటిపిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
-ప్రభుత్వం నిర్దేశించిన ఏడు అర్హతలకు ఎదురుగా సాటిస్ఫైడ్ అని ఉంటే మీకు డబ్బులు వస్తాయి
-అన్‌సాటిస్ఫైడ్ అని ఉంటే డబ్బులు రావు
డిసెంబర్ 10లోపు వచ్చే అవకాశం.?
ఏదైనా సమస్య ఉంటే అధికారులును కలిసి గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డు తీసుకొని గ్రామ లేదా వార్డు సచివాలయంకు వెళ్లి వెల్ఫేర్ సెక్రెటరీ ద్వారా కూడా మీ పేరు లిస్టులో ఉందో లేదో తెలుసుకోవచ్చు. అక్టోబర్ 10వ తేదీనే ప్రభుత్వం డబ్బులు సిద్ధం చేసినప్పటికీ.. ఎన్నికల కోడ్ వల్ల నిలిపివేశారు. ఇప్పుడు కోడ్ ముగిసిన తర్వాత డిసెంబర్ నెలలో డబ్బులు విడుదల చేసే అవకాశముంది. ముఖ్యంగా డిసెంబర్ 10లోపు ఈ నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో ఈ నిధుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. విద్యార్థి తరపున తల్లి ఖాతాలో వీటిని ప్రభుత్వం జమ చేస్తోంది. తల్లిదండ్రులు లేకపోతే సంరక్షుల అకౌంట్లో వేస్తోంది. ఒకవేళ జమ చేసిన తర్వాత మీకు నిధులు అందకపోతే గ్రామ, వార్డు సచివాలయలను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు.
