AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: మీ పీఎఫ్ అకౌంట్ బ్లాక్ అయిందా..? మొబైల్‌లో ఒకే క్లిక్‌తో యాక్టివ్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?

పీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యే సమయంలో ఐదుసార్లకు మించి తప్పుగా డీటైల్స్ ఎంటర్ చేయడం వల్ల మీ అకౌంట్ తాత్కాలికంగా బ్లాక్ కావచ్చు. ఇలాంటి సందర్భాలలో ఈపీఎఫ్ఓ పోర్టల్‌ ద్వారా బ్లాక్ అయిన ఖాతాను తిరిగి యాక్సెస్ చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా మీ పీఎఫ్ ఖాతాను సులువుగా అన్‌బ్లాక్ చేసుకోవచ్చు.

EPFO: మీ పీఎఫ్ అకౌంట్ బ్లాక్ అయిందా..? మొబైల్‌లో ఒకే క్లిక్‌తో యాక్టివ్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?
Epfo
Venkatrao Lella
|

Updated on: Nov 29, 2026 | 11:29 AM

Share

పీఎఫ్ అకౌంట్ బ్లాక్ అవ్వడం అనేది అనేకమంది ఖాతాదారులకు ఎదురయ్యే ఒక సాధారణ సమస్యగా చెప్పవచ్చు. యూఏఎన్ నెంబర్ లేదా పాస్‌వర్డ్‌ను ఐదుసార్లు కంటే ఎక్కువసార్లు తప్పుగా ఎంటర్ చేసినప్పుడు అకౌంట్ బ్లాక్ అవుతుంది. అలాగే ఈ-నామినేషన్ వివరాలను అప్‌డేట్ చేయకపోతే మీ పీఎఫ్ ఖాతా బ్లాక్ అయ్యే ఛాన్సు ఉంటుంది. మీ ఖాతాలో ఈ-నామినేషన్ వివరాలు లేకపోతే కనీసం ఐదుసార్లు లాగిన్ అయిన తర్వాత కూడా ఖాతా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఈ-నామినేషన్ అనేది పీఎఫ్ క్లెయిమ్స్, ఇతర ఆన్‌లైన్ సేవలకు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఖాతాను తిరిగి ఎలా యాక్సెస్ చేయాలో చాలామందికి తెలియదు. ఈ సమస్యకు ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఒక సులభమైన పరిష్కారాన్ని అందించింది. మీ పీఎఫ్ అకౌంట్ బ్లాక్ అయినట్లయితే.. దానిని అన్‌బ్లాక్ చేయడానికి ఈపీఎఫ్ఓ పోర్టల్ ఒక ఆప్షన్‌ను అందిస్తుంది. మీ మొబైల్ నుంచే సులువుగా ఈ విధానంలో యాక్టివ్ చేసుకోవచ్చు.

పీఎఫ్ అకౌంట్ యాక్టివ్ చేసుకోవడం ఎలా..?

-ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్‌కు వెళ్లండి

-సైన్ ఇన్ బటన్ కింద “అన్‌లాక్ అకౌంట్” అనే ఆప్షన్ కోసం చూడండి

-ఈ ఆప్షన్ కనిపిస్తే దానిపై క్లిక్ చేయండి

-ఈ ఆప్షన్ వెంటనే కనిపించకపోతే పేజీని రీఫ్రెష్ చేయాలి. కొన్నిసార్లు ఈ ఆప్షన్ కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు

– ఆప్షన్ కనిపించకపోతే గంట తర్వాత మళ్లీ లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించాలి. ఈ పద్ధతి ద్వారా మీ బ్లాక్ అయిన పీఎఫ్ ఖాతాను అన్‌లాక్ చేయవచ్చు

నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయడం ఎలా..?

మీ పీఎఫ్ అకౌంట్లో ఈ-నామినేషన్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే.. మీ ఖాతా పరిమితం అవుతుంది. ఇది మీ పీఎఫ్ క్లెయిమ్స్ లేదా ఇతర ఆన్‌లైన్ పీఎఫ్ సంబంధిత పనులకు ఆటంకం కలిగిస్తుంది. ఈ-నామినేషన్ చేయడానికి ఈపీఎఫ్ఓ హోమ్ పేజీలో లాగిన్ అయ్యి, “మేనేజ్” అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. అనంతరం మీ నామినీ పేర్లు, వయస్సు, ఫొటో, ఆధార్ కార్డ్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం “ఈ-నామినేషన్” ప్రక్రియ పూర్తమవుతుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా మీ ఖాతా బ్లాక్ అవ్వకుండా రక్షించుకోవచ్చు. అలాగే మీరు ఆన్‌లైన్ సేవలను సజావుగా ఉపయోగించుకోవచ్చు. ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయడం వల్ల ఒకవేళ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఖాతాదారుడు మరణిస్తే నామినీలు పీఎఫ్ ఖాతాలోని సొమ్ము విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే జీవిత బీమా కూడా పొందవచ్చు. కుటుంబసభ్యులు ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.

Follow Us
PF ఖాతా బ్లాక్ అయిందా? ఇంట్లోనే ఇలా అన్‌లాక్ చేసుకోండి
PF ఖాతా బ్లాక్ అయిందా? ఇంట్లోనే ఇలా అన్‌లాక్ చేసుకోండి
ఆదిలాబాద్ లో కన్నుల పండుగగా ఆరట్టు ఉత్సవం
ఆదిలాబాద్ లో కన్నుల పండుగగా ఆరట్టు ఉత్సవం
డీలిమిటేషన్‌పై ఢీ అండే ఢీ.. దేశ రాజకీయాల్లో కీలక పరిణామం
డీలిమిటేషన్‌పై ఢీ అండే ఢీ.. దేశ రాజకీయాల్లో కీలక పరిణామం
మూడేళ్లుగా మూగబోయిన గొంతు.. నాలుగు రోజుల్లోనే మళ్లీ మాట్లాడేలా
మూడేళ్లుగా మూగబోయిన గొంతు.. నాలుగు రోజుల్లోనే మళ్లీ మాట్లాడేలా
చలికి కరివేపాకు మొక్క వాడిపోతోందా.. ఈ 5 టిప్స్‌ పాటిస్తే
చలికి కరివేపాకు మొక్క వాడిపోతోందా.. ఈ 5 టిప్స్‌ పాటిస్తే
బెండకాయలు ఉన్నాయా? ఈసారి ఇలా వేపుడు చేయండి.. రుచి అదిరిపోద్ది!
బెండకాయలు ఉన్నాయా? ఈసారి ఇలా వేపుడు చేయండి.. రుచి అదిరిపోద్ది!
భారీగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన స్టార్స్ వీళ్లే..
భారీగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన స్టార్స్ వీళ్లే..
ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..?
ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..?
మెనోపాజ్ తర్వాత మహిళలు పాలు తాగితే ఏమవుతుంది? అధ్యయనంలో నిజాలివే!
మెనోపాజ్ తర్వాత మహిళలు పాలు తాగితే ఏమవుతుంది? అధ్యయనంలో నిజాలివే!
ఏపీలో ఓటర్లకు అలర్ట్.. మీ ఓటు ఏ వార్డులో ఉందో ఇలా తెలుసుకోండి
ఏపీలో ఓటర్లకు అలర్ట్.. మీ ఓటు ఏ వార్డులో ఉందో ఇలా తెలుసుకోండి