AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో తప్పక తినాల్సిన ఆహారాలు ఇవే!

చలికాలం వచ్చిందంటే చాలు రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. అంతే కాకుండా అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అందుకే చలికాలంలో తప్పకుండా కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలంట. కాగా, ఇప్పుడు మనం శీతాకాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Nov 29, 2026 | 12:43 PM

Share
ఉసిరి :  చలికాలంలో తప్పకుండా తినాల్సిన వాటిలో ఉసిరి ముందు వరుసలో ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి చలికాల సమస్యల నుంచి కాపాడుతుంది. రోజూ ఒక ఉసిరి తిన్నా, ఉసిరి రసం తాగినా చాలు. జుట్టు రాలడం తగ్గి, చర్మం మెరుస్తుంది. షుగర్ ఉన్నవారికి కూడా ఉసిరి ఎంతో మేలు చేస్తుంది

1 / 5
ఆరెంజ్  : చలికాలంలో విరివిగా దొరికే ఆరెంజ్ ను అస్సలు మిస్ చేయకూడదు. ఈ పండులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. చలికాలంలో చర్మం పొడిబారిపోకుండా, తేమగా ఉండేలా చేస్తుంది. రోజూ ఒక ఆరెంజ్ తింటే జలుబు త్వరగా రాదు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హాయిగా తినొచ్చు.

2 / 5
చిలకడ దుంప :  చిలకడ దుంప ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన తప్పకుండా దీనిని చలికాలంలో మీ డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిదంట. ఇందులో ఉండే ఖనిజాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా అనేక అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడతాయి.

3 / 5
వెల్లుల్లి : చలికాలంలో వెల్లుల్లిని తప్పకుండా డైట్ లో చేర్చుకోవాలి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడతాయి. వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బీపీ, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. రోజూ ఉదయం పరగడుపున 1-2 వెల్లుల్లి రెబ్బలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి వేసిన వేడి వేడి పప్పు, రసం చలికాలంలో చాలా మేలు చేస్తాయి.

4 / 5
అల్లం : చలికాలానికి అల్లం దివ్యౌషధం లాంటిది. అల్లంలో ఉండే జింజెరాల్ అనే గుణం శరీరానికి వేడిని ఇస్తుంది. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతు మంట, కీళ్ల నొప్పులకు అల్లం చక్కని మందు. రోజూ ఉదయం అల్లం వేసిన టీ తాగితే శరీరం వెచ్చగా ఉంటుంది. అల్లం జీర్ణశక్తిని పెంచి, గ్యాస్, కడుపుబ్బరం సమస్యలను తగ్గిస్తుంది. వంటల్లో అల్లం వేసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.

5 / 5
Follow Us