AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: భారత్ వద్ద మొత్తం ఎంత బంగారం ఉందో తెలుసా..? బయటపడ్డ అసలు లెక్కలు..

ప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశాల్లోని తన బంగారు నిల్వలను స్వదేశానికి తరలిస్తోంది. గత ఆరు నెలల్లో దాదాపు 60 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చింది. దీంతో మొత్తం నిల్వల్లో 84 శాతం ఇప్పుడు దేశంలోనే భద్రంగా ఉన్నాయి.

Gold: భారత్ వద్ద మొత్తం ఎంత బంగారం ఉందో తెలుసా..? బయటపడ్డ అసలు లెక్కలు..
Rbi Gold
Venkatrao Lella
|

Updated on: Nov 29, 2026 | 12:21 PM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో నిల్వ ఉన్న తన బంగారు నిల్వల్లోని 60.08 టన్నుల బంగారాన్ని భారత్‌కు విజయవంతంగా తరలించింది. ఈ పరిణామంతో దేశీయంగా బంగారు నిల్వలు భారీగా పెరిగాయి. ఇంతకముందు 680.05 టన్నులు బంగారు నిల్వలు ఉండగా.. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన నిల్వలతో 2026 సెప్టెంబర్ నాటికి మొత్తం నిల్వలు 740.13 టన్నులకు చేరుకున్నాయి. ప్రస్తుతం మొత్తం బంగారు నిల్వలు 880.52 టన్నులకు చేరుకున్నాయి. దీంతో స్వదేశంలో నిల్వ ఉన్న బంగారం వాటా 84 శాతానికి పెరిగింది. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యూహంలో ఒక ముఖ్యమైన మార్పునకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ప్రపంచంలోని అనేక కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వల్లో కొంత భాగాన్ని విదేశాల్లో నిల్వ చేస్తాయి. ప్రధానంగా లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థల్లో నిల్వ చేస్తాయి. అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక లావాదేవీల సౌలభ్యం, తక్కువ నిల్వ ఖర్చులు, అధిక భద్రత ప్రపంచవ్యాప్తంగా బంగారం మార్పిడికి ఉన్న సులభమైన మార్గాలుగా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా తక్షణ నిధుల అవసరాలు లేదా ఆర్థిక మార్పిడి ఒప్పందాల కోసం విదేశాల్లో బంగారం నిల్వ చేయడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా ఉంటుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వదేశానికి తిరిగి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితితో పాటు అంతర్జాతీయ సంబంధాలలో మార్పులు లేదా సంఘర్షణలు చోటుచేసుకున్నప్పుడు విదేశాల్లో నిల్వ ఉన్న ఆస్తులపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉండవచ్చు. ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి బంగారం స్వదేశానికి తరలిస్తుంటారు.

ఇక దేశంలో భద్రమైన, ఆధునిక నిల్వ సదుపాయాలు అందుబాటులోకి వచ్చినప్పుడు బంగారాన్ని స్వదేశం నుంచి ఇక్కడికి తీసుకొస్తుంటారు. అలాగే సొంత దేశంలో బంగారాన్ని నిల్వ చేయడం ద్వారా కేంద్ర బ్యాంక్ తన ఆస్తులపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది. ఎటువంటి బాహ్య ప్రభావాలకు లోనుకాకుండా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. దేశీయంగా ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచడం, అంతర్జాతీయ పెట్టుబడిదారులలో దేశ ఆర్థిక స్థిరత్వం పట్ల నమ్మకాన్ని పెంచడం కోసం స్వదేశానికి బంగారాన్ని తరలిస్తుంటారు. ప్రస్తుతం బంగారాన్ని వెనక్కి తీసుకురావడానికి గల కారణాలను అధికారికంగా ఆర్బీఐ వెల్లడించలేదు. తన భవిష్యత్ ఆర్థిక స్థిరత్వం, భద్రతను పెంపొందించే దిశగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని చెబుతున్నారు.

Follow Us