AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant: కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ పనికిరాడు.. అసలు కారణం చెప్పిన రవిచంద్రన్ అశ్విన్..!

Rishabh Pant: రిషబ్ పంత్‌ భారత టెస్టు జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశం ఎందుకు కోల్పోయాడు? అతడిలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, కొన్ని తప్పిదాలు అతడి ఎదుగుదలకు అడ్డుగా నిలిచాయని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో పంత్ ఔటైన తీరుపై కూడా అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Rishabh Pant: కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ పనికిరాడు.. అసలు కారణం చెప్పిన రవిచంద్రన్ అశ్విన్..!
Rishabh Pant
Venkata Chari
|

Updated on: Nov 29, 2026 | 11:57 AM

Share

Rishabh Pant: భారత్, న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో రిషబ్ పంత్ ఔటైన తీరుపై మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులు సమర్పించుకున్న తర్వాత ఒత్తిడిలో బ్యాటింగ్ చేసింది. ఈ సమయంలో పంత్ అనవసరమైన రిస్క్ తీసుకుని వికెట్ కోల్పోయాడు. జాకబ్ డఫీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పంత్.. 39 బంతుల్లో 23 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ షాట్ సెలక్షన్‌పై అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించాడు.

పంత్‌కు టెస్టు కెప్టెన్సీ దక్కేది.. కానీ..!

రిషబ్ పంత్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాటర్లలో ఒకడిగా ఎదిగే ప్రతిభ ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అయితే, తన ఆటలో మెరుగైన నిర్ణయాలు తీసుకుని ఉంటే పంత్ భారత జట్టులో నాలుగో స్థానంలో స్థిరపడటమే కాకుండా, టెస్టు జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉండేదని పేర్కొన్నాడు.

“పంత్‌కు తరతరాల్లో గుర్తుండిపోయే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా మారే ప్రతిభ ఉంది. కానీ అతడు తన ఆటను మరింత మెరుగుపరుచుకుని, సరైన నిర్ణయాలు తీసుకుని ఉంటే భారత జట్టులో నాలుగో స్థానంలో రెగ్యులర్ బ్యాటర్‌గా ఉండేవాడు. దేశానికి కెప్టెన్‌గా కూడా వ్యవహరించే అవకాశం ఉండేది. అతడి నిర్ణయాలే అతడిని వెనక్కి లాగాయి” అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: IND vs NZ: 91 బంతుల్లో 12 పరుగులు.. టెస్టు క్రికెట్‌ హిస్టరీలో చెత్త రికార్డులో టీమిండియా జోడీ..!

పంత్ తరచూ అధిక రిస్క్‌తో కూడిన షాట్లు ఆడి వికెట్ కోల్పోతున్నాడని అశ్విన్ పేర్కొన్నాడు. ఫీల్డర్లు ఎక్కడ ఉన్నారో గమనించకుండా బంతిని గాల్లోకి ఆడేందుకు ప్రయత్నించడం అతడి బలహీనతగా అభివర్ణించాడు.

పంత్ ఆటను ‘సెల్ఫ్‌లెస్ క్రికెట్’ అనలేం..!

పంత్ దూకుడుగా ఆడే విధానాన్ని చాలామంది జట్టు ప్రయోజనం కోసం చేసే నిస్వార్థ క్రికెట్‌గా అభివర్ణిస్తుంటారు. అయితే అశ్విన్ ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. పంత్ టెస్టు సెంచరీలు, ఆ మ్యాచ్‌ల ఫలితాలను పరిశీలించినప్పుడు ఆశించిన స్థాయిలో విజయాలు కనిపించలేదని చెప్పాడు.

గబ్బాలో చేసిన 89 పరుగుల ఇన్నింగ్స్‌ను కూడా విజయాల్లో భాగంగా పరిగణిస్తే, అతడి కీలక ఇన్నింగ్స్‌లలో రెండు లేదా మూడు మాత్రమే విజయాలకు దోహదపడ్డాయని అశ్విన్ వివరించాడు.

“90 పరుగుల వద్ద ఔటైనంత మాత్రాన అది నిస్వార్థమైన ఆట అని చెప్పలేం. కొన్నిసార్లు అది నిర్లక్ష్యం లేదా ఆలోచనలేని ఆట కూడా కావచ్చు” అని అశ్విన్ స్పష్టం చేశాడు.

ఎక్కువమంది చదివినది: శ్రీలంక సిరీస్‌కు భారత జట్టు.. సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం..!

జురెల్ పోరాటంతో భారత్‌కు 246 పరుగులు..

మరోవైపు, రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ వికెట్ కోల్పోయినప్పటికీ ధ్రువ్ జురెల్ అద్భుతంగా పోరాడాడు. అతడు 88 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. తొమ్మిదో వికెట్‌కు ఆకాష్ దీప్‌తో కలిసి 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేయగలిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us