Video: వికెట్ తీసిన ఆనందం.. కట్‌చేస్తే.. మైదానంలోనే డ్యాన్స్ చేసిన జస్ప్రీత్ బుమ్రా..!
Jasprit Bumrah Dance Video: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తోనే కాదు.. డ్యాన్స్‌తోనూ అందరినీ ఆకట్టుకున్నాడు. హెన్రీ నికోల్స్‌ను అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేసిన తర్వాత మైదానంలో సరదాగా స్టెప్పులేశాడు. బుమ్రా చేసిన ఈ స్పెషల్ సెలబ్రేషన్ ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Jasprit Bumrah Dance Video: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా నవంబర్ 29న జరిగిన మూడో రోజు ఆటలో హెన్రీ నికోల్స్ వికెట్ తీసిన తర్వాత బుమ్రా చేసిన సెలబ్రేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కీలక వికెట్ కోసం భారత్ ఎదురుచూస్తున్న సమయంలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నికోల్స్‌ను పెవిలియన్‌కు పంపిన వెంటనే ఆనందంతో చిన్నపాటి డ్యాన్స్ చేశాడు. దీంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు అభిమానుల దృష్టిని కూడా ఆకర్షించాడు.
రిటర్న్ క్యాచ్‌తో నికోల్స్‌కు బుమ్రా షాక్..!
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 17.3వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బుమ్రా 129.4 కిలోమీటర్ల వేగంతో మిడిల్ స్టంప్‌పై ఫుల్ లెంగ్త్ బంతిని వేశాడు. బంతి స్వల్పంగా లోపలికి రావడంతో హెన్రీ నికోల్స్ లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే బ్యాట్‌ను ముందుగానే తిప్పడంతో బంతి బ్యాట్‌కు తగిలి నేరుగా బుమ్రా వైపు వెళ్లింది. అప్రమత్తంగా స్పందించిన బుమ్రా మోకాలి ఎత్తులో వచ్చిన బంతిని చక్కగా అందుకున్నాడు. దీంతో నికోల్స్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఎక్కువమంది చదివినది: శ్రీలంక సిరీస్‌కు భారత జట్టు.. సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం..!
అప్పటికి నికోల్స్ 42 బంతుల్లో 22 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో భాగస్వామ్యాలు నిర్మిస్తున్న సమయంలో ఈ వికెట్ భారత్‌కు కీలకంగా మారింది.
వికెట్ తీసిన వెంటనే బుమ్రా స్పెషల్ డ్యాన్స్..!
BOOM WITH THE MOVES! 🕺
Jasprit Bumrah grabs his second, holding on to a sharp return catch to send Henry Nicholls packing! 💥
Watch the HERO VIDA India Tour of New Zealand, 2nd Test, Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.
#SonySportsNetwork #SonyLIV #NZVIND
— Sony Sports Network (@SonySportsNetwk) November 29, 2026
హెన్రీ నికోల్స్ క్యాచ్ అందుకున్న వెంటనే బుమ్రా ఆనందంతో డ్యాన్స్ చేశాడు. సాధారణంగా వికెట్ తీసిన తర్వాత దూకుడుగా సెలబ్రేట్ చేసే బుమ్రా.. ఈసారి మాత్రం సరదాగా స్టెప్పులేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఎక్కువమంది చదివినది: IND vs NZ: 91 బంతుల్లో 12 పరుగులు.. టెస్టు క్రికెట్ హిస్టరీలో చెత్త రికార్డులో టీమిండియా జోడీ..!
ఈ డ్యాన్స్ వీడియో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ టెస్టులో బుమ్రా తన బౌలింగ్ రన్‌అప్‌లో కూడా కొంత మార్పు తీసుకొచ్చిన విషయం ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
