నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ .. నిత్యా మీనన్

Rajitha Chanti

Pic credit - Instagram

29 November 2026

దక్షిణాది సినిమాల్లో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యా మీనన్ వ్యక్తిగత జీవితం, పెళ్లిపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ తాను పెళ్లికి వ్యతిరేకం కాదని, తనకూ పెళ్లి చేసుకోవాలని ఉందని స్పష్టం చేశారు.

అయితే జీవితంలో ప్రశాంతతను దెబ్బతీసే బంధంలోకి వెళ్లడం మాత్రం తనకు ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

గతంలో కొన్ని ప్రేమ బంధాల్లో ఉన్నప్పుడు ఎదుటివారి ప్రభావం తనపై ఎక్కువగా ఉండేదని నిత్యా మీనన్ వెల్లడించారు. అలాంటి పరిస్థితుల్లో తన ఆలోచనలు, వ్యక్తిత్వం, 

ఎదుగుదలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపించిందని తెలిపారు.

భయంతో కాకుండా, జీవితంపై కలిగిన స్పష్టమైన అవగాహనతోనే ఆ బంధాల నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు నిత్యా మీనన్.

అప్పటివరకు ఉక్కిరిబిక్కిరి చేసిన పరిస్థితుల నుంచి బయటపడిన తర్వాతే తనకు ఎంతో ప్రశాంతత లభించిందని పేర్కొన్నారు.

సమాజం కోసమో, వయసు పెరుగుతోందనే కారణంతోనో పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని నిత్య అన్నారు. తనకు కావాల్సింది కేవలం పెళ్లి అనే బంధం మాత్రమే కాదని అన్నారు.