AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi: ‘వారణాసి’ వివాదానికి ముగింపు.. రాజమౌళి, మహేష్ కోసం స్వచ్ఛందంగా టైటిల్ ఇచ్చేసిన దర్శకుడు

దర్శక ధీరుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం వారణాసి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. అలాగే మలయాళం స్టార్ పృథ్వీరాజ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Varanasi: 'వారణాసి' వివాదానికి ముగింపు.. రాజమౌళి, మహేష్ కోసం స్వచ్ఛందంగా టైటిల్ ఇచ్చేసిన దర్శకుడు
Varanasi Movie
Basha Shek
|

Updated on: Jul 24, 2026 | 6:56 AM

Share

దర్శకుడు సుబ్బారెడ్డి తన వద్ద రిజిస్టర్ అయిన ‘వారణాసి’ సినిమా టైటిల్‌ను దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్, దర్శకుడు సుబ్బారెడ్డి కలిసి ఇంటర్వ్యూలో చర్చించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ, 2023లో ‘వారణాసి’ టైటిల్‌ను తన బ్యానర్‌పై రిజిస్టర్ చేసుకుని ఆ కథపై పని ప్రారంభించానని తెలిపారు. అయితే అదే టైటిల్ రాజమౌళి సినిమా కోసం అవసరమైందని తెలిసిన తర్వాత, తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా ఎలాంటి సందేహం లేకుండా ఇవ్వాలని నిర్ణయించుకున్నానన్నారు. తన అభిమాన హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ కలిసి చేస్తున్న ఈ భారీ చిత్రానికి టైటిల్ ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

టైటిల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారంగా చూడలేదని, ఒక్క రూపాయి కూడా తీసుకోవాలనే ఆలోచన తనకు రాలేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. “టైటిల్ అనేది నాకు ఒక ఎమోషన్. దాన్ని అమ్మడానికి కాదు, మంచి సినిమా కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డాను” అని పేర్కొన్నారు. దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ, మొదట సుబ్బారెడ్డి ఆ టైటిల్‌పై ఎంతో భావోద్వేగంతో ఉన్నారని, అందుకే వెంటనే మాట్లాడలేదన్నారు. తరువాత రాజమౌళి, కేఎల్ నారాయణ వంటి ప్రముఖుల చిత్రం కోసం టైటిల్ ఇస్తే ఇండస్ట్రీకి మంచి సందేశం వెళ్తుందని వివరించగా, సుబ్బారెడ్డి వెంటనే అంగీకరించారని తెలిపారు. టైటిళ్లను డబ్బు కోసం కాకుండా, పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరస్పరం సహకరించుకోవాలని ఈ నిర్ణయం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని వీరశంకర్ అభిప్రాయపడ్డారు. సుబ్బారెడ్డి చేసిన ఈ నిర్ణయం భవిష్యత్‌లో ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గేయరచయిత చంద్రబోస్‌లకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘వారణాసి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌