AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anumana Pakshi: అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

Anumana Pakshi: అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

Phani CH
|

Updated on: Sep 26, 2026 | 6:38 PM

Share

రాగ్‌ మయూర్‌ హీరోగా విమల్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అనుమాన పక్షి’ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రతి విషయాన్నీ అనుమానించే సన్నీ పాత్ర చుట్టూ సాగే కామెడీ, సిట్యుయేషనల్‌ సీన్స్‌ నవ్విస్తాయి. ఫస్టాఫ్‌లో హీరో అల్లరి, సెకండాఫ్‌లో అజయ్‌ పోలీస్‌ పాత్ర, రీల్స్‌ కాన్సెప్ట్‌ ఆకట్టుకుంటాయి. రాగ్‌ మయూర్‌ సహజమైన నటన, మెరిన్‌ ఫిలిప్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, శ్రీచరణ్‌ పాకాల సంగీతం, కశ్మీర్‌ విజువల్స్‌ సినిమాకు ప్లస్‌ పాయింట్లుగా నిలిచాయి.

టాలీవుడ్ యంగ్ యాక్టర్ రాగ్ మయూర్ ఇటీవల జాతీయ స్థాయిలో ఒక ప్రతిష్ఠాత్మకమైన అవార్డును గెలుచుకున్నారు. 2026 జూలైలో ముంబైలో జరిగిన ‘నెక్సా ఇండియన్ స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్’ మూడో ఎడిషన్‌లో ఆయనకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. ఈయన హీరోగా చేసిన సినిమానే అనుమాన పక్షి. ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘డిజె టిల్లు’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు విమల్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూద్దాం. అనుమాన పక్షి ఈ సినిమా కథేంటంటే.. సన్నీ అలియాస్ రాగ్ మ‌యూర్‌ ‘అనుమాన పక్షి’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంటాడు. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం, అందరినీ అనుమానించడం మనోడి నైజం. ఈ క్రమంలో తన స్నేహితుడు అనంతు డిప్రెషన్‌లో ఉన్నానని, కాశ్మీర్‌లో ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్ చేస్తాడు. దాంతో సన్నీ, రమ్య అనే అమ్మాయిని ఇష్టపడే వర్మ అలియాస్ ప్రిన్స్ సహాయంతో కాశ్మీర్‌ బయలుదేరుతాడు. అక్కడ కన్య అలియాస్ మెరిన్ ఫిలిప్ పరిచయమవ్వడం, అనుకోకుండా వర్మ హత్యకు గురికావడం, రీల్స్ చేయడానికి పిచ్చిగా ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ వాసు అలియాస్ అజయ్ ఎంట్రీ ఇవ్వడంతో గందగోల పరిస్థితి ఏర్పడుతుంది. అసలు వీరందరి మధ్య సంబంధం ఏమిటి? ఈ చిక్కుముడిని సన్నీ ఎలా విప్పాడు? అనేదే తెరపై చూడాల్సిందే. డైరెక్టర్ విమల్ కృష్ణ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. ప్రతి చిన్న విషయానికి అనుమానపడే హీరో పాత్ర చుట్టూ తిరిగే సీన్స్‌ను కామెడీ రాసుకున్నాడు. ఆ సీన్స్ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. ఫస్టాఫ్‌లో హీరో చేసే అల్లరి, సిచ్యుయేషనల్ కామెడీ చాలా బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా చేసిన హంగామా, రీల్స్ కాన్సెప్ట్ ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా చాలా సరదాగా సాగుతాయి. స్క్రీన్‌ప్లేలో సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచిందనే చెప్పాలి. ఇక లీడ్ రోల్ చేసిన రాగ్ మ‌యూర్‌ యాక్టింగ్ ట్యాలెంట్ గురించి చెప్పేదేముంది. అనుమానంతో అందర్నీ ఎంటర్‌ టైన్ చేశాడు. అనుమాన పక్షి క్యారెక్టర్‌లో చాలా సహజంగా నటించాడు. మనోడి టైమింగ్‌ను అందరూ ఎంజాయ్‌ చేస్తారు. ఇక తెలుగు తెరకు పరిచయమైన మెరిన్ ఫిలిప్ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించింది. ప్రిన్స్, అజయ్ కూడా తన పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే.. శ్రీచరణ్ పాకాల మంచి మ్యూజిక్ ఇచ్చాడు.గులాబ్‌ జామ్ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్ తెచ్చుకుంది. థియేటర్లో కూడా ఈ సాంగ్ లిరిక్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు శ్రీ చరణ్‌. మూడ్‌కి తగ్గట్టుగా .. తన మ్యూజిక్‌తో ఈయన అదరగొట్టాడు. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే.. సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. ప్రతీ ప్రేమ్‌ రిచ్‌గా కనిపిస్తుంది. కాశ్మీర్ అందాలను సినిమాటోగ్రాఫర్ సునిల్ కుమార్ నామా చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశారు. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే.. కామెడీ కోరుకునే ప్రేక్షకులకు ‘అనుమాన పక్షి’ మంచి ఛాయిస్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmi Gautam: ‘నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

Srikanth Odela: ‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

Hanuman Ansh: 400 కోట్ల వైపు పరుగులు.. 2 కోట్ల చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

The Paradise: నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

The Paradise: టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌

Follow Us