ఉత్తర్ ప్రదేశ్కు చెందిన విజయ్ కుమార్ శర్మ 27 ఏళ్ల నిరంతర కృషి తర్వాత 59 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తూనే, ప్రభుత్వ టీచర్ కావాలనే తన కలను నెరవేర్చుకున్నారు. ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో రాతపరీక్షలో అర్హత సాధించి, సంస్కృత ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందారు. ఇది పట్టుదలకు నిదర్శనం.