అరెరే.. ఆ బ్లాక్ బస్టర్ సినిమాను మీనాక్షి మిస్ చేసుకుందా.? 

26 September  2026

Rajeev 

Pic credit - Instagram

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కథానాయికల్లో మీనాక్షి చౌదరి పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది.

స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 

తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన సినీ విషయం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ మూవీ ‘టిల్లు స్క్వేర్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ ‘లిల్లీ’ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ పాత్ర కోసం మొదట మీనాక్షిని అనుకున్నారట

 మేకర్స్ ఆమెను ఈ పాత్ర కోసం పరిశీలించినప్పటికీ.. చివరకు ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయింది. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ వచ్చిందట

అయితే ఒకవేళ ఇదే పాత్రలో మీనాక్షి చౌదరి నటించి ఉంటే సినిమా ఎలా ఉండేదో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు మీనాక్షి అభిమానులు.