AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరణంలోనూ వీడని స్నేహం.. ఫ్రెండ్‌ కాపాడేందుకు నీటిలో దిగి ముగ్గురు చిన్నారులు మృతి!

విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కోనేటి వద్ద స్నానం చేసేందని వెళ్లిన ముగ్గు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తొలుత నీటిలో పడిని స్నేహితుడని కాపాడేందుకు నీటిలోకి దిగిన మరో ఇద్దరూ కూడా జలసమాది అయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మరణంలోనూ వీడని స్నేహం.. ఫ్రెండ్‌ కాపాడేందుకు నీటిలో దిగి ముగ్గురు చిన్నారులు మృతి!
Budharayavalasa Pond Tragedy
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Sep 26, 2026 | 11:42 PM

Share

విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుధరాయవలస గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోనేటిలో స్నానం చేసేందుకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. బుధరాయవలస గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు స్నానం చేసేందుకని కోనేటి వద్దకు వెళ్లారు. వారిలో ఒకరు స్నానం చేసేందుకు నీటిలోకి దిగాడు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి నీటిలో మునిగిపోయాడు. అతడిని గమనించిన మరో ఇద్దరు విద్యార్థులు వెంటనే కాపాడేందుకు కోనేటిలోకి దిగారు. అయితే ఊహించని విధంగా ముగ్గురూ నీటిలో చిక్కుకుపోయారు. కొద్దిసేపటికి ఊపిరాడక పోవడంతో భయంతో కేకలు వేశారు.

ఇదంతా చూస్తున్న అక్కడే ఉన్న మిగతా విద్యార్థులు వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు హుటాహుటిన కోనేటి వద్దకు చేరుకుని నీట మునిగికి విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే వారు మృతి చెందారు. మృతులను చందు, వెంకటేష్, హేమచందర్‌రావుగా గుర్తించారు. ఇక సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

రోజురోజు స్కూల్ నుంచి వచ్చి సరదా సరదాగా ఆడుతూ సందడి చేసే చిన్నారులు ఇలా కోనేటిలో ప్రమాదవశాత్తు చనిపోవడం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిన్నారులు చెరువు, కోనేరు వంటి నీటి వనరుల వద్దకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు, పెద్దలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌