AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న శ్రీను నుంచి కుమార్తె సిరి సహస్ర వరకు.. విజయనగరం జడ్పీ పీఠంపై మజ్జి కుటుంబం!

విజయనగరం జిల్లా పరిషత్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తర్వాత ఆయన కుమార్తె మజ్జి సిరి సహస్ర అదే జడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించనున్నారు. సెప్టెంబర్ 8న వైసీపీని వీడి టీడీపీలో చేరిన చిన్న శ్రీను.. ఇప్పుడు తన కుమార్తె టీడీపీ తరఫున అదే పదవిని చేపట్టనుండటంతో జిల్లా రాజకీయాల్లో చర్చ మొదలైంది.

చిన్న శ్రీను నుంచి కుమార్తె సిరి సహస్ర వరకు.. విజయనగరం జడ్పీ పీఠంపై మజ్జి కుటుంబం!
Majji Siri Sahasra With Father
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Nov 20, 2026 | 5:38 PM

Share

రాజకీయాల్లో వారసత్వం కొత్తేమీ కాదు. అయితే ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాలు ఒకే కీలక పదవిని చేపట్టడం మాత్రం ఆసక్తికర పరిణామమే. విజయనగరం జిల్లా పరిషత్ రాజకీయాల్లో ఇప్పుడు అలాంటి ఘట్టమే చోటుచేసుకోబోతోంది. జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తర్వాత.. ఆయన కుమార్తె మజ్జి సిరి సహస్ర జడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించనున్నారు. దీంతో తండ్రి నుంచి కుమార్తెకు జిల్లా పరిషత్ పగ్గాలు మారుతున్నాయి.

తండ్రి తర్వాత కుమార్తెకు అవకాశం

2026 సెప్టెంబర్ 26 వరకు వైసీపీకి చెందిన మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. జిల్లా పరిషత్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన పదవీకాలం ముగియడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో అనూహ్యంగా ఆయన కుమార్తె మజ్జి సిరి సహస్ర పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆమె అదే జడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ నుంచి టీడీపీలోకి చిన్న శ్రీను

ఈ పరిణామంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. సెప్టెంబర్ 8న మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పార్టీ మారిన కొద్ది కాలంలోనే జిల్లా రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుకున్నారనే చర్చ సాగుతోంది. ఇప్పుడు ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీ తరఫున జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటివరకు తండ్రి రాజకీయ ప్రస్థానాన్ని దగ్గర నుంచి చూసిన సిరి సహస్ర.. ఇప్పుడు అదే జిల్లా పరిషత్ పీఠంపై కూర్చోబోతున్నారు. దీంతో మజ్జి కుటుంబ రాజకీయ ప్రస్థానంలో మరో అధ్యాయం మొదలుకానుంది. ఒకప్పుడు తండ్రి నాయకత్వంలో సాగిన రాజకీయ ప్రయాణం.. ఇప్పుడు కుమార్తె నాయకత్వంలో కొనసాగనుంది.

అయితే తండ్రి రాజకీయ గుర్తింపు, అనుభవం ఆమెకు ఒక అవకాశంగా మారినా.. తనకంటూ ప్రత్యేక నాయకత్వాన్ని ఏర్పరచుకోవడం సిరి సహస్ర ముందున్న ప్రధాన సవాలు. జిల్లా పరిషత్ పాలనలో తనదైన ముద్ర వేస్తారా? తండ్రి రాజకీయ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన చిన్న శ్రీను కుమార్తెకు అదే టీడీపీ తరఫున జడ్పీ చైర్‌పర్సన్ పదవి దక్కడంతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామం ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. చిన్న శ్రీను నుంచి సిరి సహస్ర వరకు.. ఒకే కుటుంబంలో రెండు తరాలు, ఒకే జడ్పీ పీఠం.. విజయనగరం రాజకీయాల్లో ఇదో ఆసక్తికర పరిణామం!

Follow Us