కొండల్లో, కోనల్లో బతికే గిరిజన ప్రజల కష్టాలు వర్ణనాతీతం. వారికి జీవన విధానం, మౌలిక సదుపాయాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కనీస ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి కూడా అగచాట్లు పడే గ్రామాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వాలు, పాలకులు ఎంతమంది మారుతున్నా మన్యంవాసులు, కొండ ప్రాంతాల ప్రజలు పడే కష్టాలకు మాత్రం పుల్స్టాప్ పడటం లేదు.. గిరిపుత్రుల కష్టాలు తీరడం లేదు. దశాబ్దాల అవస్థలకు చెక్ పెడుతూ ఇప్పటి సర్కార్ తీసుకున్న నిర్ణయం ఓ నవ శకానికి నాందికానుంది..