AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: చూస్తే విస్తరాకులు కుప్ప అనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు

చంద్ర గ్రహణం సమయంలో గిట్టని వారిపై కొందరు ఈ క్షుద్రపూజలు నిర్వహించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ సమయంలో క్షుద్రపూజలు చేస్తే తమ శత్రువులకు హాని తలపెట్టవచ్చని, అందుకే గ్రహణం రోజు క్షుద్రపూజలు జరిపారని చెప్పుకొస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Andhra: చూస్తే విస్తరాకులు కుప్ప అనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
Andhra News
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Mar 06, 2026 | 1:28 PM

Share

విజయనగరం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. బొండపల్లి శేరిచెరువు గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి భయానక పూజలు నిర్వహించారు. చెరువు గట్టుపై బొమ్మ పెట్టి తెల్లని ముగ్గులు వేసి, పసుపు, కుంకుమ చల్లి పూజలు జరిపారు. అంతేకాకుండా అక్కడ రెండు నల్ల కోళ్లు కోసి పూజలు జరిపిన ప్రాంతంలో రక్తం చల్లి, పూజా సామగ్రి అంతా చెల్లాచెదురుగా పడి ఉంది. అలా భయానకంగా ఉన్న పూజలు చూసిన స్థానికులకు ఇది క్షుద్రపూజల వ్యవహారమే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల జరిగిన చంద్ర గ్రహణం సమయంలో గిట్టని వారిపై కొందరు ఈ క్షుద్రపూజలు నిర్వహించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ సమయంలో క్షుద్రపూజలు చేస్తే తమ శత్రువులకు హాని తలపెట్టవచ్చని, అందుకే గ్రహణం రోజు క్షుద్రపూజలు జరిపారని చెప్పుకొస్తున్నారు. తెల్లవారుజామున అటుగా వచ్చిన స్థానికులు భయానకంగా ఉన్న పూజలు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున చెరువు వద్దకు చేరుకొని ఆ ప్రాంతమంతా పరిశీలించారు. వారికి కనిపించిన ఆ పూజలతో భయాందోళనకు గురయ్యారు. దీంతో ఇప్పుడు రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. కొందరు ఇది క్షుద్రపూజలేనని భావిస్తుండగా, మరికొందరు తెలియని వ్యక్తులు చేసిన తాంత్రిక పూజలు కావచ్చని అంటున్నారు గ్రామస్తులు. అయితే ఈ ఘటనపై స్పష్టత రావాలంటే పోలీసులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఇలాంటి ఘటనలు గ్రామాల్లో భయాందోళనలకు గురిచేస్తాయని, ఈ క్షుద్రపూజలు ఎవరిపై చేశారో, ఎవరికి ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. దీనిపై అధికారులు దృష్టి సారించి నిజానిజాలు వెలికి తీయాలని స్థానికులు కోరుతున్నారు.

Andhra News

ఇది చదవండి: నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటుడు

Follow Us